నందమూరి నటసింహం బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో సందడి చేసిన వీర సింహారెడ్డి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, అంచనాలు కాస్త తడబడినట్లుగా ఉంది. వీర సింహారెడ్డి సినిమాకి మీక్స్ డ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ లైన్, లాగ్ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎలివేషన్స్ పరంగా మాత్రం వీర సింహారెడ్డి బాలయ్య అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా చెబుతున్నారు.
సినిమా విడుదల తర్వాత అందరూ రివ్యూ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. ఆ తర్వాత మాత్రం సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది? ఎప్పుడు రాబోతోంది అనేదే వెతుకుతారు. అయితే వీర సింహారెడ్డి ఏ ఓటీటీలోకి రాబోతోందో సమాచారం రానే వచ్చింది. వీర సింహారెడ్డి ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్రెడిట్స్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనే చూపించారు. అంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇంక సినిమా స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. సినిమాని కచ్చితంగా 45 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సినిమా క్రేజ్ పెరిగి.. థియేటర్ రన్ టైమ్ పెరిగితే ఓటీటీలోకి వచ్చే సమయం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. బాలయ్య అభిమానులు మాత్రం ప్రస్తుతం వీర సింహారెడ్డి మేనియాలో ఉండిపోయారు. అమెరికాలో అయితే వీర సింహారెడ్డి థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన హంగామాకి సినిమాని మధ్యలో ఆపేసి వారిని బయటకు పంపేశారు. మరి.. బాలయ్య అభిమానులు అంటే ఆ మాత్రం సందడి ఉంటుంది. కానీ, అమెరికా వాళ్లకు తెలియదు కాబట్టే అలా పంపేసినట్లు చెబుతున్నారు.