చలికాలం చంపేస్తోంది. రోజురోజుకు మారుతున్న వాతావరణం వల్ల థియేటర్ కి వెళ్లి సినిమా ఏం చూస్తాంలే అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలానూ ఓటీటీలో కూడా కొత్త సినిమాలు చాలానే ఉన్నాయి కదా అనుకుంటున్నారు. అందులో భాగంగా వాటిని చూసేందుకు ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు వెబ్ సిరీస్, సినిమాలు.. ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. మరి ఆ జాబితా ఏంటి.. ఏయే తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. వీటిలో కొన్ని నేరుగా ఓటీటీలోనూ రిలీజ్ అవుతుండటం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత సీన్ చాలా మారిపోయింది. సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే సినిమాలు కూడా ప్రతి వారం 15కి మించి రిలీజ్ అవుతున్నాయి. అలానే ఈసారి కూడా ఏకంగా 16 సినిమాలు-వెబ్ సిరీసులు ప్రేక్షకులు ముందుకొస్తున్నాయి. వాటిలో రష్మిక తొలి హిందీ సినిమా ‘గుడ్ బై’ ఉంది. అలానే ప్రస్తుతం థియేటర్లలో సూపర్ సక్సెస్ అయిన లవ్ టుడే తమిళ వెర్షన్ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. దీంతో పాటే మోహన్ లాల్ ‘మాన్ స్టర్’ సినిమా కూడా తెలుగు డబ్బింగ్ ఈ వారమే విడుదల కానుండటం విశేషం.