టాలీవుడ్ లో ట్రెండ్ మారిపోయింది. సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనే విషయాలు అస్సలు చూడటం లేదు. కంటెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అలాంటి సినిమాల్నే ఆదరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో అలా థియేటర్లలోకి హిట్ సినిమాలు తీసుకుంటే ‘కార్తికేయ 2’, ‘కాంతార’. ఈ రెండు చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో అలరించి వందల కోట్ల వసూళ్లు సాధించాయి. కంటెంట్ ని నమ్ముకుని తక్కువ బడ్జెట్ పెట్టిన సరే హిట్ కొట్టొచ్చని నిరూపించాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ రెండు సినిమాల స్థాయిలో కాకపోయినా సరే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి హిట్ అయిన మరో తెలుగు సినిమా ‘మసూద’. హారర్ సినిమాలంటే రెగ్యులర్ గా ఒకే తరహాలో ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసిన ఈ చిత్రం.. ఆడియెన్స్ కి సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ప్రతి సీన్ కు కూడా భయపడేలా చేసింది. సాయికిరణ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ కీలకపాత్రలు పోషించారు. నవంబరు 18న ప్రేక్షకులు ముందుకొచ్చి, ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.
ఇక ఇలాంటి సినిమాలు థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలి. ఒకవేళ మీరు గనుక చూడకపోతే మాత్రం ఓటీటీలో చూసేయొచ్చు. మొన్నటి వరకు డిసెంబరు 16 లేదా 23న రావొచ్చని అన్నారు. కానీ ప్రముఖ ఓటీటీ ఆహా.. ‘మసూద’ స్ట్రీమింగ్ గురించి ట్వీట్ చేసింది. డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెక్స్ట్ వీకెండ్ కు సంబంధించి ఇప్పుడు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మరి ‘మసూద’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Tik, tik, tik, tik…
What better time of the day to announce this spine chilling horror film of all time🤯 #MasoodaOnAha from December 21st.#SaiKiran @IamThiruveeR @KavyaKalyanram @sangithakrish @Bandhavisri @prashanthvihari @RahulYadavNakka @SVC_Official @Swadharm_Ent pic.twitter.com/X6hC88isUR— ahavideoin (@ahavideoIN) December 14, 2022