ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు డోకా లేదు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలను చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తున్నాయి ఓటిటి ప్లాట్ ఫామ్స్. ఇదివరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నేరుగా టీవీలోకి వస్తుండేవి. కానీ.. ఎప్పుడైతే టీవీలో సినిమాలకు ఆదరణ తగ్గి, ఓటిటిలకు ఆదరణ పెరిగిందో.. అప్పటినుండి జనాలంతా ఓటిటిలనే టీవీలుగా భావించేస్తున్నారు. అయితే.. ఈ పరిస్థితులన్నీ కేవలం లాక్ డౌన్ తర్వాతే నెలకొన్నాయని చెప్పాలి. ఓటిటిలు వచ్చాక థియేట్రికల్ సినిమాలు వేరు, ఓటిటి సినిమాలు వేరు అయిపోయాయి.
ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలను నేరుగా ఓటిటిలకు అమ్ముకుంటున్నారు. మరికొన్ని సినిమాలు ధైర్యం చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. కానీ.. చివరికి అది ఓటిటికే కరెక్ట్ అనిపించుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న టైంలో ఏ సినిమా అయినా కంటెంట్ క్యారెక్టరైజేషన్స్ పరంగానే సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే.. ఇప్పుడు మరో చిన్న సినిమా ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయింది. గతంలో జాతిరత్నాలు మూవీ భారీ హిట్ అయ్యింది కదా.. అని అలాంటి కామెడీనే బేస్ చేసుకొని ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా తెరకెక్కించారు దర్శకుడు అనుదీప్ అసిస్టెంట్స్.
డెబ్యూ యాక్టర్స్ శ్రీకాంత్ రెడ్డి, సంచిత ప్రధాన పాత్రలలో ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా రూపొందించారు. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథను అందించగా.. పూర్ణోదయా పిక్చర్స్, మిత్రవిందా మూవీస్, శ్రీజ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా మూవీని నిర్మించారు. అయితే.. ప్రమోషన్స్ పరంగా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. విడుదలైన తర్వాత కంటెంట్ పరంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో సినిమాకు సరైన ఆదరణ లభించక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక విడుదలైన 20 రోజులకే ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
సెప్టెంబర్ 2న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా డిజిటల్ హక్కులను తెలుగు ఓటిటి ‘ఆహా’ వారు కొనుగోలు చేశారు. ఇక సెప్టెంబర్ 23 నుండి ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్నీ ఆహా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఇటీవల తెలుగు సినిమాలు విడుదలైన ఎనిమిది వారాల వరకూ డిజిటల్ స్ట్రీమింగ్ చేయొద్దని నిర్మాతల కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు ఆ రూల్ వర్తించట్లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. నిర్మాతలు ఆ రూల్ ప్రకటించకముందే ఆహాతో ఈ సినిమా అగ్రిమెంట్ అయిపోయిందని సమాచారం. మరి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
First-day First show ante ela undala? Ooru ooru motha mogipovala.
Ade pawan kalyan movie ante, ika raccha rambola…#FirstDayFirstShowOnAHA premieres September 23. @TanikellaBharni @vennelakishore @PrabhasSreenu_ @radhanmusic @Ram_Miriyala @bashu_sanchita @anudeepfilm pic.twitter.com/NSeWwhyxTU— ahavideoin (@ahavideoIN) September 14, 2022