సినీ ఇండస్ట్రీలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలన్నీ ఓటిటిలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదీగాక ఈ మధ్య సినిమాలను థియేటర్లలో చూడటంకంటే ఓటిటిలోనే బెటర్ అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. లాక్ డౌన్ టైమ్ నుండి ఇంట్లోనే ఉంటూ ఓటిటి ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు. స్టార్స్ దగ్గరనుండి డెబ్యూ హీరోల వరకూ ఎన్ని సినిమాలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కోసం స్టార్ కాని స్టార్ అయిన ఓ లెజెండ్ సినిమా ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతోంది.
హీరోగా సినిమాలు చేయాలనే కోరికతో 50 ఏళ్ళ వయసులో కోలీవుడ్ డెబ్యూ చేశారు అరుళ్ శరవణన్. తమిళనాడులో పాపులర్ అయినటువంటి ‘లెజెండ్ శరవణ స్టోర్స్’ అధినేత శరవణన్.. ఇటీవల ‘ది లెజెండ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఐదు పదుల వయసులో కూడా స్టార్ ఏమాత్రం తగ్గని స్థాయిలో బడ్జెట్ పెట్టి, పాన్ ఇండియా స్థాయిలో ది లెజెండ్ సినిమా రిలీజ్ చేశారు శరవణన్. అందులోనూ ఇద్దరు పాపులర్ హీరోయిన్స్ లెజెండ్ తో రొమాన్స్ చేశారు. అయితే.. శరవణ స్టోర్స్ కోసం అప్పుడప్పుడు యాడ్స్ చేసే శరవణన్.. ఏకంగా హీరోగా సినిమా చేసేసరికి అతనిపై, ది లెజెండ్ సినిమాపై ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి.
సినిమాకు నెగటివ్ టాక్, నువ్వు హీరో ఏంటంటూ ఎన్ని ట్రోల్స్ వచ్చినా లెజెండ్ శరవణన్.. అవేవి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయాడు. రీసెంట్ గా కొత్త సినిమా కూడా అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది లెజెండ్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కేవలం హీరో కారణంగానే ప్లాప్ టాక్ తెచ్చుకుందని వార్తలు వచ్చాయి. అదీగాక ది లెజెండ్ సినిమాకు శరవణన్ ఒక్కడే కొత్త కాగా.. సినిమాలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అంతా హేమాహేమీలు కావడం విశేషం. అయితే.. థియేటర్స్ లో సినిమాను ప్లాప్ చేసినా.. ది లెజెండ్ మూవీ ఓటిటిలో ఎప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్షకులు భారీస్థాయిలో ఉన్నారు.
ఈ మూవీలో శరవణన్ సరసన హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రూటేలా, రాయ్ లక్ష్మీ నటించారు. జేడీ, జెర్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వయంగా శరవణనే నిర్మించాడు. అయితే.. ఎట్టకేలకు ట్రోల్స్ తో పాపులర్ అయిన ది లెజెండ్ మూవీ ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ‘ది లెజెండ్’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 23 లేదా 30 నుండి ఓటిటి స్ట్రీమింగ్ కానుందని కోలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ‘ది లెజెండ్’ మూవీ అందుబాటులోకి రానుంది. మరి ది లెజెండ్ శరవణన్ డెబ్యూ మూవీ ఓటిటి రిలీజ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Upco-Movies & New DVD Reel 21K (@upcoming_mm_new_ott_release)