ఉండవల్లి అరుణ్ కుమార్. ఒకప్పటి కాంగ్రెస్ నేత. మాజీ ఎంపీ. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉండవల్లి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయ పరిస్థితి ఏదైనా.. ఆయన అనాలసిస్ చేసినంత అద్భుతంగా ఎవ్వరూ చేయరని చాలా మంది నమ్ముతారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి మీదైనా ఓ కామెంట్ చేస్తే.., దానికి ఓ విలువ ఉంటుంది. అలాంటిది తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..,
సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా.. “జర్నలిస్ట్ డైరీ సుమన్ టీవీ ఇన్సియేటివ్” కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్.. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సంచలన కామెంట్స్ చేశారు.
“2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పై చాలా అంచనాలు ఉన్న మాట వాస్తవం. కానీ.., ఆ ఎన్నికల్లో ఆయనకి చాలా అవమానకరమైన ఫలితాలు వచ్చాయి. చివరికి వ్యక్తిగతంగా ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోవడం మరీ దారుణం. ఇలాంటి ఓటమి ఎదురైతే.. ఎవరైనా ఇక రాజకీయాల్లో కొనసాగడానికి సంకోచిస్తారు. నా వల్ల కాదని రాజకీయాల నుండి తప్పుకుంటారు. కానీ.., పవన్ కళ్యాణ్ చాలా త్వరగా మళ్ళీ ప్రజల ముందుకి వచ్చారు. నేను ఎక్కడికి పోవడం లేదు. రాజకీయాల్లోనే ఉంటాను. ఈ లోపు తాను బతకడానికి, పార్టీని బతికించుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తానని చాలా క్లియర్ గా చెప్పేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చూపిన తెగువకి నేను షాక్ అయ్యాను” అంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..,ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.