ఫిల్మ్ డెస్క్- కామెడీ షోలకు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. బుల్లి తెరపై కామెడీ షోలకు ఉన్న క్రేజ్ మరే కార్యక్రమాలకు లేదంటే అతియోశక్తి కాదేమో. జబర్దస్త్ కామెడీ షో తరువాత అన్ని ఛానల్స్ లో కామెడీ కార్యక్రమాలను మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చూసినా కామెడీ ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక ఇలా కామెడీ షోలు పెరిగిపోవడంతో చాలా మంది ఆర్టిస్ట్ లకు గుర్తింపు వచ్చింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాంకర్స్ గురించి. కామెడీ షోలన్నింటిలో యాంకర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. జబర్దస్త్ లో అనసూయ, రష్మికి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.
ఇక కామెడీ షోల యాంకర్స్ లో చెప్పుకోవాల్సింది విష్ణుప్రియ గురించి. పలు టీవీ షోలను హోస్ట్ చేస్తున్న విష్ణుప్రియ చేసే హంగామా అంతా ఇంతా కాదు. విష్ణుప్రియ చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. టీవీ షోల్లేనే కాదు సోషల్ మీడియాలోను విష్ణుప్రియ యాక్టివ్ గా ఉంటుంది. స్టార్ మా ఛానల్‌లో కమెడీ స్టార్స్ అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ జడ్జీలుగా ఉన్న ఈ షోలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్ విష్ణు ప్రియ. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ లో వచ్చే విష్ణుప్రియ చీరతో వచ్చి కాస్త పద్దతిగానే కనిపించింది.
ఇక బూతు కామెడీ చేయడంతో దిట్ట అయిన అవినాష్‌తో కలిసి ఈ షోలో రెచ్చిపోయింది. ఇక అవినాష్ కళ్ల నిండా రొమాన్స్ నింపుకున్నవాడిలా, నిన్ను చూస్తుంటే నాకు బీపీ లేస్తుంది అని అవినాష్ అంటే, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చిందని విష్ణుప్రియ అంది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయని చెప్పుకొచ్చింది. అంతే కాదు మనకి అబ్బాయి పుడితే ముకేష్ అని పెడదాం,అమ్మాయి పుడితే మకేశ్వరి అని పేరు పెడదాం అనుకున్నానని సిగ్గుపడుతూ చెప్పింది విష్ణుప్రియ.