విశాఖపట్నం- ఇప్పుడు సినీ తారలు ఎవరికి వారు సొంత ప్రమోషన్ చేసుకోవడం ట్రేండ్. అందులోను హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అవకాశాలు సన్నగిల్లిన ముద్దుగుమ్మలైతే కాస్త అందాల డోస్ ను పెంచి ఆ పిక్స్ ను, ఫోటోలను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇదిగో విశాఖ బ్యూటీ రేఖా భోజ్ అదే పనిచేసింది.
అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదంటోంది రేఖా భోజ్. దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ.. వంటి సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ప్రస్తుతం సినిమా అవకాశాలు అంతగా లేకపోవడంతో సొంతంగా వైజాగ్‌లో స్టుడియో స్టార్ట్ చేసింది రేఖా భోజ్.
ఇన్ స్టాగ్రామ్, ఫెస్ బుక్ ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్న రేఖా భోజ్, అందాలతో కనువిందు చేస్తోంది. తాజాగా విశాఖపట్నం బీచ్‌లో జాకెట్ లేకుండా చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ ఓ రేంజ్‌లో పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇచ్చిపడేద్దాం ఇక.. అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే అందాల విందు చేసింది. బ్లౌజ్ లెస్ ఫోజుల్లో నిరీక్షణ హీరోయిన్‌ని గుర్తు చేసింది. రేఖా భోజ్ ఇన్ స్టాగ్రామ్స్ రీల్స్ వీడియోలైతే మరో లెవల్ లో ఉన్నాయంటున్నారు అభిమానులు.
ఆ మధ్య గుంటూరు బీటెక్ విద్యార్ధిని రమ్య దారుణ హత్య సందర్బంగా షాకింగ్ పోస్ట్ ని షేర్ చేసింది రేఖా భోజ్. ఆ తరువాత మా ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రచ్చపై స్పందిస్తూ.. తెలుగు హీరోయిన్స్‌కి అవకాశం కల్పించాలని చెప్పింది. హీరోయిన్‌గా పెద్ద పేరు సంపాదించలేకపోయిన రేఖా భోజ్, సోషల్ మీడియాలో మాత్రం అందరికి పిచ్చెక్కిస్తోంది.