విజయవాడ- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు చెబితే జనంతో పాటు పోలీసులు సైతం వణికిపోతారు. ఎందుకంటే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు అంత భయంకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ చేసిన దోపిడీలన్నీ పోలీసులకు అంతుపట్టకుండానే ఉన్నాయి. కానీ ఎట్టకేలకు విజయవా పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించారు. గత కొన్ని రోజులుగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెడ్డీ గ్యాంగ్ ముఠాలో ముగ్గురు నిందితులను బెజవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. ఈ సందర్భంగా సీపీ కాంతిరాణా టాటా చెడ్డీ గ్యాంగ్ గురించి పలు అంశాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, దొంగతనాల నియంత్రణకై పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్తులు, జైలు నుంచి విడుదలైన నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తులపై పటిష్టమైన నిఘా పెట్టామని ఈయన చెప్పారు.విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నంతే పాటు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేశామని సీపీ తెలిపారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, పెనమలూరు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీగా చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గుజరాత్‌కు చెందిన మడియా కాంజీ, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియాను ఆరెస్ట్ చేశారు పోలీసులు.
మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని, నిందితుల నుంచి 20,000 డబ్బు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని సీపీ కాంతిరానా టాటా తెలిపారు. దొంగతనాలకు వచ్చేటప్పుడు కేవలం నిక్కరు మాత్రమే ధరిస్తారు ఈ గ్యాంగ్ కు చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది. సాధారనంగా వీళ్లంతా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్లలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడ నగర శివార్లలో నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండే ఇళ్లు, అపార్ట్మెంట్ లను పగలు సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారు. ఎవరైనా అడ్డొస్తే చంపడానికి కూడా వెనుకాడదీ చెడ్డీ గ్యాంగ్.
Vijayawada city police have arrested three members of the Cheddi gang from Gujarat for committing various crimes in the jurisdiction of vijayawada police commissionerate
Vijayawada City Police have constituted three special ..@APPOLICE100 @dgpapofficial pic.twitter.com/AHgVhaqp1Z
— Vijayawada City Police (@VjaCityPolice) December 17, 2021