స్మార్ట్ వాచ్ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ యాపిల్ వాచ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. కానీ, వాటిని కొనాలంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, మార్కెట్ లోకి ఒక స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. దాని లుక్స్ చూస్తే అచ్చు యాపిల్ వాచ్ అల్ట్రాలాగానే ఉంటుంది.
స్మార్ట్ వాచ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తుంటారు. స్మార్ట్ ఫోన్ అయినా, స్మార్ట్ వాచ్ అయినా కూడా యాపిల్ కంపెనీ అంటేనే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాగే వాటి ప్రోడక్టుల ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక సాధారణ స్మార్ట్ వాచ్ అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలలోపు కొనుగోలు చేయచ్చు. అదే యాపిల్ వాచ్ అయితే మీరు కనీసం రూ.30 వేలు ఖర్చు చేయాలి. అయితే ఈ స్మార్ట్ వాచ్ కొన్నారనుకోండి.. మీ దగ్గర యాపిల్ వాచ్ అల్ట్రా ఉన్నట్లే ఉంటుంది. లుక్స్ లో ఎంత రిచ్ గా ఉంటుందో.. ఫీచర్లు కూడా అంతే రిచ్ గా ఉన్నాయి.
స్మార్ట్ వాచ్ అంటే అందరూ ధరలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు. కానీ, మార్కెట్ లో ఇప్పటికే చాలా స్మార్ట్ వాచ్ లు బడ్జెట్ రేంజ్ లోనే విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు మంచి లుక్స్, డిజైన్ తో వచ్చాయి. ఎన్ని బడ్జెట్ మోడల్స్ వచ్చినా.. చాలా మందికి యాపిల్ వాచ్చే కొనాలని ఉంటుంది. కానీ, అది కొనాలంటే అంత బడ్జెట్ ఉండదు. అలాంటి వారికోసం ఈ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. మీరు రూ.2 వేలు పెట్టి ఈ అర్బన్ ప్రో ఎం బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేస్తే.. మీ దగ్గర రూ.80 వేల విలువైన యాపిల్ వాచ్ అల్ట్రా ఉన్న ఫీల్ వస్తుంది. స్ట్రాప్స్ కూడా యాపిల్ వాచ్ తరహాలోనే ఉంటాయి. ఈ అర్బన్ స్మార్ట్ వాచ్ కలర్స్, డిజైన్ లో అచ్చు యాపిల్ వాచ్ అల్ట్రాని పోలి ఉంటుంది. ఇది మొత్తం 5 కలర్ ఆప్షన్స్ లో వస్తోంది.
దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.91 ఇంచెస్ బిగ్ డిస్ ప్లేతో వస్తోంది. ఇందులో 550 నిట్స్ బ్రైట్ నెస్ ఉంది. ఉంటే ఎండలో కూడా మీకు వాచ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఇన్ఫినిటీ లూప్ స్ట్రాప్ తో వస్తోంది. ఇందులో ఆరెంజ్ కలర్ కూడా ఉంది. ఈ రెండే ఈ వాచ్ ని యాపిల్ వాచ్ అల్ట్రాతో కంపేర్ చేసేలా చేస్తున్నాయి. అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ మానిటర్, 107 స్పోర్ట్స్ మోడ్స్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు బ్యాకప్ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మిడ్ నైట్ బ్లాక్, మిస్టీ బ్లూ, స్మోకీ గ్రే, బ్లష్ పింక్, ట్రెండీ ఆరెంజ్ కలర్స్ లో వస్తోంది. దీన ధర రూ.1,999గా నిర్ణయించారు.
#URBAN Launches Pro M, the Premium and Most Affordable #Smartwatch with Smart Bluetooth Calling Feature@InbaseIndia @aashishkumbhat #URBANProM #ProMSmartwatch #URBANsmartwatch #Callingsmartwatchhttps://t.co/TLXgcgrc6n pic.twitter.com/ki2wYOpzwQ
— DeviceNext (@DeviceNXT) April 11, 2023