బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,990.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,090.
1కిలో వెండి 73,000
బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలో మార్పు లేదు. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 990 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 49 వేల 90 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధరలో కూడా మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 73 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 290 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 330 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 470 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,610 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,380 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,380 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,430 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.