స్వల్పంగా తగ్గిన బంగారం ధర
బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 35 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 39 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 45 వేల 150 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 390 రూపాయలు తగ్గి 49 వేల 250 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 1400 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 66 వేల 300 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 50 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 50 రూపాయలు పెరిగింది.