10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,500.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,640.
1కిలో వెండి 69,000బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి 45 వేల 500 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గి 49 వేల 640 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 69 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 540 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 880 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,050 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,560 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 49,560 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,800 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,100 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.