స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వాడకం అందరికీ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అది మంచి కానీ, చెడు గానీ సోషల్ మీడియా లో వైరల్ అయి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలానే శనివారం ఢిల్లీలో జరిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఢిల్లీలో కారును ఢీకొట్టాడని ఓ మహిళ ఈ-రిక్షా డ్రైవర్ చెప్ప దెప్పలు కొట్టింది. 90 సెకన్ల వ్యవధిలో 17 సార్లు ఆ రిక్షా డ్రైవర్ పై చేయి చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన కిరణ్ సింగ్ అనే మహిళ.. నోయిడాలోని సెక్టార్-110లో నివాసం ఉంటుంది. శనివారం ఓ ఈ-రిక్షా డ్రైవర్ ఆమె కారు వెనుక భాగంలో పొరబాటును ఢీకొట్టారు. దీంతో కారు వెనుక భాగం కొంత గీసుకుపోయినట్టు అయింది. అంతే తప్ప.. కారు వెనుక భాగం అంతగా ఏమీ డ్యామేజ్ కాలేదు. అయితే.. ఈ-రిక్షా తన కారును ఢీ కొట్టడంతో శివాలెత్తిపోయిన ఆ మహిళా.. రిక్షా లోపల ఉన్న ఆ డ్రైవర్ ను చొక్కపట్టుకుని మరి.. బయటకి లాగింది. కారు దగ్గర నుంచి రిక్షా దగ్గరకు, అక్కడ నుంచి కారు వద్దకు తిప్పుతూ చెంప దెబ్బలు కొట్టింది. 90 సెకన్ల వ్యవధిలోనే 17 సార్లు అతనిపై చెంప దెబ్బలతో విరుచుకుపడింది. ఆ మహిళ ఇ-రిక్షా ఆపరేటర్ చొక్కా చింపేందుకు కూడా ప్రయత్నించింది.
పొరపాటున తగిలింది మేడమ్ అంటున్నా.. ఆ మహిళ వినిపించుకోలేదు. ఈ ఘటనను అక్కడున్న వారిలో ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లులో ఎక్కువ మంది ఆ మహిళ తీరును తప్పుబడుతున్నారు. నష్టం జరిగితే చెల్లించమని అడగాలి గానీ అలా అమానుషంగా చేయి చేసుకోవడం ఏంటని ఆ మహిళ తీరును ఎండగట్టారు. ఆ మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Incident from NOIDA: A WOMAN slapped a poor e-rickshaw driver.
17 slaps in less than 90 seconds, she constantly kept abusing the poor e-rickshaw wala. #PurushAayog demands strict action against the woman for taking law in her hand !!@noidapolice#DomesticViolenceOnMen pic.twitter.com/u2VbarbNW9
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) August 13, 2022