దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2021లో సూపర్ ఫామ్‌తో చెలరేగిన రుతురాజ్ దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా 4 సెంచరీలు బాదేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో ఏకంగా 4 సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు.
ఈ ఘనతను 11 ఏళ్ల క్రితమే విరాట్ కోహ్లీ సాధించాడు. ఆ తర్వాత పృథ్వీ షా, దేవదత్త్ పడిక్కల్ 2020-21 సీజన్‌లో నాలుగు సెంచరీలు సాధించారు. ఇప్పుడు రుతురాజ్ కూడా వీరి సరసన చేరాడు. మహరాష్ట్ర తరపున ఆడుతున్న రుతురాజ్ మధ్యప్రదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 136 పరుగులు, చండీగఢ్‌తో మ్యాచ్‌లో 154(నాటౌట్), కేరళతో జరిగిన మ్యాచ్‌లో 124తో వరుసగా మూడు సెంచరీలతో చెలరేగాడు. ఇక ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులే చేసిన రుతురాజ్ చండీగఢ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో 168 పరుగుల భారీ స్కోర్ సాధించాడు.
దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్న రుతురాజ్‌ను త్వరలో జరగనున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రుతురాజ్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి రుతురాజ్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్.. ఋతురాజ్ గైక్వాడ్ బయోగ్రఫీ!
Batters with four 💯s in one edition of the Vijay Hazare Trophy:
– Virat Kohli in 2008-09
– Devdutt Padikkal in 2020-21
– Prithvi Shaw in 2020-21
– Ruturaj Gaikwad this season!— ESPNcricinfo (@ESPNcricinfo) December 15, 2021