ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పుష్ప మూవీని రూపొందించారు. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో సినమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. పుష్ప సినిమాకు ఉన్న భారీ డిమాండ్ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతకు మించి జరిగిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో పుష్ప సినిమా హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఫిల్మ్ నగర్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 144.90 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 101.75 కోట్ల బిజినెస్ జరిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతాల వారిగా పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లైతే.. ఉత్తరాంధ్ర- 12.25 కోట్లు, నైజాం- 36 కోట్లు, సీడెడ్- 18 కోట్లు, గుంటూరు- 9 కోట్లు, కృష్ణా- 7.5 కోట్లు, నెల్లూరు- 4 కోట్లు, తూర్పు గోదావరి- 8 కోట్లు, పశ్చిమ గోదావరి- 7 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 101.75 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని సమాచారం. అటు కర్ణాటకలో చూస్తే 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ 4 కోట్లు, బాలీవుడ్ లో 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్లు, మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 144.90 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు సినిమాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో పుష్ప మూవీ నాలుగో స్థానంలో నిలించింది. ఈ సినిమా కంటే ఎక్కువగా బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే బాహుబలి 1 రికార్డును పుష్ప బ్రేక్ చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.