మన దగ్గర స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం.. భారీ ఎత్తున డబ్బులు తీసుకుని బడా వ్యాపారవేత్తలు, రాజకీయనాయకుల ఇళ్లల్లో జరిగే వివాహాది వేడుకల్లో డ్యాన్స్ చేస్తారు. ఎక్కువగా బాలీవుడ్ తారలు ఇందుకు ఒప్పుకుంటారు. ఇలా చేయడాన్ని వారి అభిమానులు, నెటిజనులు తప్పు పట్టరు. అయితే పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసినందుకు గాను నటిని.. దారుణంగా విమర్శిస్తున్నారు అక్కడి జనాలు. నీకసలు సిగ్గుందా.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా అని కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు..
పాకిస్తాన్ పాపులర్ యాక్టర్, సింగర్, యూట్యూబర్ ఆయేషా ఓమర్ పైఘా దేశ ప్రజలు, నెటిజనులు మండి పడుతున్నారు. ఆయేషా ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సాంగ్ మున్నీ బాద్నాం హూయి పాటకు చిందులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవ్వడంతో పాటు విమర్శల పాలైంది కూడా.
ఇది చదవండి: హీరోయిన్ రష్మికాకు ప్రమాదం! షాక్ లో ఫ్యాన్స్!
ఈ వీడియో చూసిన నెటిజనులు.. నీకు ఏ మాత్రం సిగ్గులేదా.. డబ్బుల కోసం ఇంత దిగజారిపోతావా.. ఇలాంటి పని చేసినందుకు నీకు శిక్ష విధించాలి అంటూ కామెంట్ చేయసాగారు. ఈ వివాదం పెద్దది కావడంతో ఆయేషా రంగంలోకి దిగి.. స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
చదవండి : బోల్డ్ షూట్ వివాదం పై స్పందించిన సీనియర్ నటి!
‘నేను డబ్బులు తీసుకుని పెళ్లిల్లలో డ్యాన్స్‌లు చేయను. కేవలం నా స్నేహితులు, బంధువుల పెళ్లిల్లకు మాత్రమే నేనిలా డ్యాన్స్ చేస్తాను. మీకు మాత్రమే మేం సెలబ్రిటీలం.. మా ఆప్తుల దగ్గర మేం చాలా సాధారణంగా ఉంటాం. అదేం నేరం కాదు’ అని చెప్పుకొచ్చింది ఆయేషా.