SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Ott Review Nayanthara Needa Telugu Film On Aha

నయనతార ‘నీడ’ చూస్తే భయం..ఖాయం !

  • Written By: Sainath Reddy
  • Updated On - Sat - 24 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నయనతార ‘నీడ’ చూస్తే భయం..ఖాయం !

ఓటీటీలో మలయాళ సినిమాలు విజయాలు సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే!ప్రేక్షకులు అందరూ ఇప్పుడు మలయాళం చిత్రాలకు బాగానే అలవాటు పడ్డారు..లాక్ డౌన్ కాలం లో కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాల హవా నడిచింది.లేటెస్ట్‌గా అమెజాన్‌లో స్ట్రీమ్‌ అవుతున్నమలయాళ చిత్రం-నయనతార‘నిళల్‌’..అంటే ‘నీడ’అని అర్థం.ఇది మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా.ఇప్పటికే ఎన్నో మంచి మలయాళ సినిమాలెన్నోచూశాం!ఈ మిస్టరీ సినిమా,వాటిలా ప్రేక్షకులకి నచ్చుతుందా అన్న విషయానికి వచ్చేముందు కథేమిటో తెలుసుకుందాం!

ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జాన్‌ బేబీ(కుంచాకో బోబన్‌).కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ ఫ్రెండ్‌ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్‌ గురించి తెలుస్తుంది.మర్డర్‌ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు.

చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే,నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్నకథలు ఒక్కొక్కటీ వాస్తవమని తేలడంతో మిస్టరీ పెరుగుతుంది. దాన్నిఛేదించడానికి హీరో,ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు?తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది?ఆమెఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటి లాంటివి చివరలోసస్పెన్స్ కి తెరపడుతుంది

ఇక పాత్రలు పాత్ర దారుల విషయానికి వస్తే..తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖం నయనతార ఒక్కరే! పిల్లాడి తల్లి పాత్రలో ఆమె చేయడానికి ఈ కథలో పెద్దగా ఏమీ కనపడదు.కథలో తొలిసారి కనిపించే లాంటి కొన్నిచోట్ల మేకప్‌ కూడా ఎక్కువవడంతో నయనతార స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్‌ పాత్రలో కుంచాకో బోబన్‌ నటన ఫరవాలేదు .

కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో,నిర్మాత,వ్యాపారవేత్త.లేటెస్ట్‌ మలయాళ థ్రిల్లర్‌ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో.సినిమా చివరలో మలయాళ దర్శక,నటుడు లాల్‌ కాసేపు కనిపిస్తారు.

కథనం ఎలాసాగిందో చూద్దాం ..మొదట కాసేపు బాగా నిదానంగా నడచినా,అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్‌ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది.కానీ ఆ ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక,రచయితల ఆశ అడియాస అయిందని చెప్పొచ్చు.ఎంచుకున్న కథ బాగున్నా, దాన్ని ప్రేక్షకులకి చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు డైరెక్టర్.ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. హీరో లవ్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ, హీరోయిన్‌ చిన్నప్పటి కష్టాలు, క్లైమాక్స్‌లో వచ్చే అసలు కథ – ఇలా ఎన్నో అంశాలున్నాయి కానీ,అన్నిటినీ కలిపి కథ ఆసక్తిగా చూపలేదు..కథారంభంలో వేసుకున్న సస్పెన్సు సంతృప్తి కలిగేలా చూపలేదనిపిస్తుంది.

కేరళలోని అందమైన లొకేషన్ల బాగున్నాయి, కర్ణాటక హొగెనెకల్‌ జలపాతం దాకా సినిమా తిరుగుతుంది.అయితే సీన్లకు సీన్లు జరుగుతున్నా కథ ముందుకు నడిచేది తక్కువ. పైగా పాత్రలూ ఎక్కువే. కథ కన్నా కెమేరా వర్క్,ఆర్‌.ఆర్‌.మీద ఎక్కువ ఆధారపడ్డారా అని అనుమానం కలుగుతుంది. సినిమాలోని రెండు పాటలూ లేకున్నా ఫరవాలేదు. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు.

నయనతార పాత్ర,ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు.పిల్లాడి కథకూ,తన కథకూ ఏదో చిక్కు ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పక పోవటం ఒక మైనస్ పాయింట్.అతీంద్రియ శక్తుల కథ అని అనుకున్నవారికి,ఇంతేనా అనిపిస్తుంది.మలయాళ సిన్మా కదా అని ఏంటో ఊహించుకుని…నయనతారపై ఆశలు పెట్టుకొని ఈ ‘నిళల్‌’చూస్తే,ఆశాభంగం తప్పదు.

అటు నయనతార,ఇటు సినిమా–ఎవరూ మెప్పించరు.ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్సున్నఈ సినిమా…లాక్‌డౌన్‌ టైమ్‌లో మరీ..ఖాళీగాఉంటే చూడడం ఓకే!అంతే తప్ప సినిమా మిస్సైనా ఏమీ బాధ పడనవసరం లేదు.సస్పెన్స్‌ కథాంశం అని ,అలాగే నయనతార నటన కోసం చూడాలి.కథ నీరసంగా నడవటం..క్లైమాక్స్ సరిగా లేకపోవటం,కథాబలానికి మించి రీరికార్డింగ్‌,కథనం ,దర్శకత్వ లోపాలు, చిత్రానికి మైనస్..సరదాగా కాలయాపన కోసం చూడటానికి ఫరవాలేదు.మీ అభిప్రాయాలను కూడా మాకు  తెలియ చేయండి.

Tags :

  • Divya Prabha
  • Kunchako boban
  • Lal
  • Nayanathara
  • Needa Movie Review
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నయనతారతో ఆ హీరోయిన్ కు గొడవ? షూటింగ్ కి రానని చెప్పి మరీ!

నయనతారతో ఆ హీరోయిన్ కు గొడవ? షూటింగ్ కి రానని చెప్పి మరీ!

  • ఆ సినిమాలో పాత్ర కోసం దర్శకుడు కమిట్మెంట్ అడిగాడు: నయనతార

    ఆ సినిమాలో పాత్ర కోసం దర్శకుడు కమిట్మెంట్ అడిగాడు: నయనతార

  • ఆ వీడియో చూసి.. నయనతారకు MP సీటు ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌!

    ఆ వీడియో చూసి.. నయనతారకు MP సీటు ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌!

  • వీడియో:మంచి మనసు చాటుకున్న నయనతార.. న్యూఇయర్‌ రోజు వారికి ఊహించని గిఫ్ట్స్‌!

    వీడియో:మంచి మనసు చాటుకున్న నయనతార.. న్యూఇయర్‌ రోజు వారికి ఊహించని గిఫ్ట్...

  • Atlee Kumar: చిక్కుల్లో షారుక్‌ ‘జవాన్’ మూవీ.. డైరెక్టర్‌ అట్లీపై ఫిర్యాదు!

    Atlee Kumar: చిక్కుల్లో షారుక్‌ ‘జవాన్’ మూవీ.. డైరెక్టర్‌ అట్లీపై ఫిర్యాదు!

Web Stories

మరిన్ని...

రోజూ ఒక స్పూన్ వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి
vs-icon

రోజూ ఒక స్పూన్ వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి

చాట్ GPTతో రోజుకి 2 వేలు సంపాదించవచ్చు!
vs-icon

చాట్ GPTతో రోజుకి 2 వేలు సంపాదించవచ్చు!

ఆస్కార్​ స్టేజీపై ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్​’ నిర్మాతకు అవమానం.. అసలేం జరిగిందంటే!​
vs-icon

ఆస్కార్​ స్టేజీపై ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్​’ నిర్మాతకు అవమానం.. అసలేం జరిగిందంటే!​

ఉగాది నాడు ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి! డబ్బులకు కొరత ఉండదు..
vs-icon

ఉగాది నాడు ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి! డబ్బులకు కొరత ఉండదు..

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అంతే!
vs-icon

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అంతే!

అనాథల పాలిట కల్పతరువు.. హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌!
vs-icon

అనాథల పాలిట కల్పతరువు.. హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌!

కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసా!
vs-icon

కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసా!

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!
vs-icon

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!

తాజా వార్తలు

  • ఈ ఉగాది నుంచి మీన రాశి వారి జాతకం! వారికి బాగా కలిసి వస్తుంది..

  • ఈ ఉగాది నుంచి ధనుస్సు రాశి వారి జాతకం! ఈ రెండు సింపుల్ పనులు చేస్తే మీరే కింగ్..

  • బ్రేకింగ్: పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!

  • ఈ ఉగాది నుంచి తులా రాశి వారి జాతకం! ఈ వ్యాపారాలతో లాభం!

  • ఈ ఉగాది నుంచి కన్యా రాశి వారి జాతకం! అదృష్టంతో పాటు డబ్బు కూడా!

  • ఈ ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి జాతకం! శని ప్రభావంతో!

  • ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారి జాతకం! ఇలా చేస్తే రెండేళ్లు నిశ్చింతగా ఉండచ్చు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • అక్కడ BJP-TDP కూటమి ఘనవిజయం.. అభినందిస్తూ జేపీ నడ్డా ట్వీట్!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam