ప్రధాని మోదీ మంచి వక్త, సభల్లో అనర్గళంగా ప్రసంగించగల నేర్పరి. విషయం ఏదైనా జనాల్లోకి సూటిగా చోచ్చుకుపోయేలా చెప్పగల నైపుణ్యం ఆయన సొంతం. అలాంటిది ఆయన కొన్ని పదాలు ప్రనౌన్స్ చేయలేరని కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగ చైర్మన్ రోహన్‌గుప్త సెటైరికల్ ట్వీట్ చేశారు. “చైనా, తాలిబాన్, నిరుద్యోగం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, రూపాయి విలువ పతనం, నెగిటివ్ జీడీపీ’’ దేశానికి శత్రువులని అందుకే ఈ అంశాలపై ప్రధాని మోదీ స్పందించరని గుప్త ఎద్దేవా చేశారు.
విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు సామాన్య జనాలపై పెనుభారమే. ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబాన్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా ఉన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రూపాయి విలువ పతనం, జీడీపీ అంశలపై విమర్శలు, చర్చలు, ఆరోపణలు జరుగుతునే ఉన్నాయి.
What are the words PM Modi can’t pronounce?
—China
—Taliban
—Unemployment
—LPG Prices
—Petrol & Diesel Prices
—Falling Rupee
—Negative GDP…all are enemies of India!
— Rohan Gupta (@rohanrgupta) September 7, 2021