నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇది వరకు ఎన్నో చూశాం. ఆ కోవకు చెందిందే ఈ వార్త. మూడు బైకులపై 14 మంది యువకులు ప్రయాణించడమే తప్పంటే.. ఆపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రయాణం సాగించారు. ఈ తతగాన్నంతా అటువైపు వెళ్తున్నవారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు ఈ వీడియో పోలీసుల చెంతకు చేరడంతో వారి చిల్లరి చేష్టలకు ఫలితం దక్కింది.
ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన 14 మంది యువకులు మూడు ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. మొదట బాగానే ప్రయాణం సాగించనప్పటికీ మార్గ మధ్యలోకి వచ్చేసరికి వారికి పూనకమొచ్చింది. బైక్‌పై స్టంట్లు చేస్తూ.. రహదారిపై ప్రమాదకరంగా ప్రయాణించారు. ఒక ద్విచక్రవాహనంపై ఏకంగా ఆరుగురు కూర్చోగా, మరో రెండు బైకులపై నలుగురు చెప్పున కూర్చున్నారు. వీరంతా దారిపొడవునా అరుస్తూ.. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ప్రయాణం సాగించారు. ఈ దృశ్యాలను దారిన పోయేవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. విషయం పోలీసుల దృష్టికి చేరింది.
14 men perform stunt on 3 bikes in UP’s Bareilly, Land in Trouble after Video goes viral#bikestunt #Bareilly #nainital #UttarPradesh #Bikedangerousstunt pic.twitter.com/TyuK9BRX4V
— India.com (@indiacom) January 11, 2023
వీడియోలు, ఫొటోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకులను పట్టుకుని మూడు బైక్‌లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే.. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, తదుపరి చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారి అఖిలేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి నిత్యం ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాటిని నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా, ఇలాంటి కొందరు బడుద్ధాయిలు వాటిని పెడచెవిన పెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ యువకులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
UP | In a viral video, 14 people were seen riding 3 bikes – 6 on one and 4 each on 2 two others – in the Deorania PS area of Bareilly.
SSP Bareilly Akhilesh Kumar Chaurasia says, “Once the information was received, the bikes were seized. Further action is being taken.” (10.01) pic.twitter.com/APBbNs4kVi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 11, 2023