బెంగళూరులో ఫ్లై ఓవర్ పై నుండి ఒక్కసారిగా నోట్ల వర్షం కురిసింది. దీంతో ఫ్లై ఓవర్ కింద నుండి వెళ్లే వారంతా ఆ నోట్ల కట్టలను ఏరుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. నోట్లు పడుతుండటంతో భారీగా గుమిగూడారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఫ్లై ఓవర్ పై నుండి నోట్లు ఒక్కసారిగా పడుతుండటంతో కొంత మంది ఆ నోట్లను ఏరుకుంటుంటే.. మరికొంత మంది ఏం జరుగుతుందో తెలియక చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని కెఆర్ పురంలోని సిర్సి సర్కిల్ లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. హుందాగా సూటు, బూటు వేసుకున్న వ్యక్తి ఓ బ్యాగ్ లో రూ. 10 నోట్ల కట్టలు తెచ్చి, బెంగళూరు ఫ్లైఓవర్ పై నుండి కిందకు విసిరేశాడు. ఆ వ్యక్తి మెడలో గడియారం వేలాడుదీసుకొని ఉండటం విశేషం. పైవంతెన ఇరు వైపుల నుండి వాటిని నేలపైకి విసిరేశాడు. ఫ్లై ఓవర్ పై ఉన్న కొంత మంది ఏం అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. మరి కొంత మంది తమకు ఆ నోట్లు ఇవ్వాలంటూ అతడిపై ఎగబడ్డారు. అయితే అతడు ఇవ్వలేదు. అలా విసురుతూనే ఉన్నారు. ఆ సదరు వ్యక్తి అలా ఎందుకు చేశాడో తెలియరాలేదు. ఫ్లై ఓవర్ కింద ఉన్న జనాలు.. నోట్ల కట్టల వర్షం కురుస్తుండటంతో వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సదరు వ్యక్తి ఎవరన్నదీ విచారిస్తున్నారు.
An unknown person allegedly threw cash (Rs. 10 notes)from KR Puram flyover in #Bengaluru. There was rush from people to collect the cash. It lead to frenzy. Cops are investigating and trying to identify the person #Karnataka pic.twitter.com/kx8mSxklsR
— Imran Khan (@KeypadGuerilla) January 24, 2023