టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.
మన అథ్లెట్స్ సరికొత్త రికార్డులు.
ఎక్కువ మెడల్స్ అమెరికావే!
ఈసారి ఇండియా రికార్డ్…
మెడల్ టేబుల్‌లో మన ప్లేస్ డబుల్ డిజిట్‌లోనే…
ఆగస్టు 8 వరకు 17 రోజుల పాటు జరిగి విశ్వ క్రీడల సంగ్రామంలో ఎన్నో కొత్త మెరుపులు, రికార్డుల జపాన్ రాజధాని టోక్యో. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ టీమ్ ముందుండి మన జాతీయ జెండా పట్టుకుని నడిచే అదృష్టం రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు దక్కింది. ఈ సారి మన అథ్లెట్లు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా ఏడు మెడల్స్ సాధించారు. అలాగే వందేడ్ల చరిత్రలో తొలిసారిగా ఫీల్డ్ అండ్ ట్రాక్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచారు.
జావెలిన్ త్రో గేమ్‌లో ఫైనల్‌కు చేరిన 12 దేశాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ తొలి గోల్డ్ ఘనతను మన దేశానికి తెచ్చిపెట్టాడు. ఇక ఒలింపిక్స్ ఓపెనింగ్ రోజునే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలిచి మన ప్లేయర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక ఒలింపిక్స్ చరిత్రలో 41ఏండ్ల తర్వాత ఇండియా మెన్స్ హాకీ టైమ్ పతకం గెలుచుకొచ్చింది. సెమీ ఫైనల్స్‌కు వెళ్లినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు మన ప్లేయర్స్. కాంస్య పతకంతో టోక్యో నుంచి విజయగర్వం వెనుదిరిగారు.
మహిళా హాకీ టీమ్ మెడల్ సాధించనప్పటికీ ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తొలిసారిగా ఇండియా విమెన్ హాకీ టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. అక్కడ ఓటమిని చవిచూసినా బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ కసిగా పోరాడి కేవలం ఒక్క గోల్ తేడాతో ఇంగ్లండ్ టీమ్ చేతిలో మనోళ్లు ఓడిపోయారు. తీవ్రమైన భావోద్వేగానికి లోనై మన మహిళా ప్లేయర్లు గ్రౌండ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. యావత్ దేశం వాళ్ల పట్టుదల, కృషిని, వాళ్లు సృష్టించిన కొత్త చరిత్రను చూసి గర్వించింది.
గోల్ఫ్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి. మన దేశం తరఫున తొలిసారి ఫైనల్‌కు వెళ్లిన ప్లేయర్‌గా అదితి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచింది. చాలా దేశాల్లో ఒలింపిక్ పతకం ఉద్యోగం తెచ్చి పెడుతుంది. కొన్నిచోట్ల జీతం పెంచుతుంది. కొన్ని ప్రోత్సాహకాలు ప్రజల్లో ఆసక్తిని రేపుతూ వార్తల్లో నిలుస్తాయి. ఇలాంటి వాటిలో దక్షిణాఫ్రికా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్‌వెయిట్ 4 రోవింగ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన సిజ్వే డ్లోవు, మాథ్యూ బ్రిటన్, జాన్ స్మిత్, జేమ్స్ థాప్సన్‌లు పతకాలు సాధించారు. ఈ నలుగురికి ఒక్కో ఆవును ప్రోత్సాహకంగా అందించారు. వ్యాపారవేత్త, టీవీ చెఫ్ జాన్ స్కానెల్ ఈ ఆవులను బహూకరించారు. టోక్యోలో రజత పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయికి 3.5 లక్షల డాలర్లు (26 కోట్లు) నగదు బహుమతి అందించారు.
మరోవైపు ఆమెకు పదోన్నతి కల్పిస్తామని భారత రైల్వే ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని సాధించిన నీరజ్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇప్పటికే హరియానా ముఖ్యమంత్రి భారీ నజరానా ప్రకటించగా తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎక్స్‌యూవీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS
— Narendra Modi (@narendramodi) August 7, 2021