దేశ ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇళ్లను వివిధ రకాల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ఎంతో చక్కగా అలంకరించారు. ప్రజలందరూ కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి పూజలు చేశారు. ఇక సాయంత్రం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వివిధ రకాల క్రాకర్స్ ను కాల్చి సంబరాలు జరుపుకుంటారు. అయితే ఇలా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకుంటుంటే.. కొందరు మాత్రం పగల కోసం ఈ వేడుకును అస్త్రంగా వాడుకుంటున్నారు. తమకు కోపం ఉన్న వారిపై పగ తీర్చుకునేందుకు టపాసులు పేల్చే పేరుతో వారిళ్లపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు అలానే చేశాడు. మరి.. ఆ యువకుడు..తనకు కోపం ఉన్న వారి ఇంటి వైపు బాణా సంచాల బాక్సులు పెట్టి నిప్పు అంటిచాడు. అంతే అవి రాకెట్ల దూసుకుంటూ ఓ అపార్టమెంట్ వైపు వెళ్లాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందరూ దీపావళి వేడుకును ఎంతో సంబరంగా జరుపుకున్నారు. కొత్త దుస్తువులు ధరించి పూజలు నిర్వహించారు. ఇష్టమైన వంటకాలను చేసుకుని ఇంటిళ్లపాది ఆరగించారు. అనేక రకాల టపాసులను కాల్చి ఎంతో ఘనంగా వేడుకను నిర్వహింకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు. అయితే కొందరు మాత్రం ఈ పండగను అడ్డంపెట్టుకొని తమ వ్యక్తిగత పగలను తీర్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు దీపావళి పండగ చాటును తన వ్యక్తిగత కోపం తీర్చుకున్నాడు. మహారాష్ట్ర లోని థానే జిల్లాలో దీపావళి పండగ రోజున ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అందరూ తమ ఇళ్ల ముందు క్రాకర్స్ కాలుస్తుంటే.. ఆ యువకుడు మాత్రం అపార్టమెంట్ ముందు నిలబడ్డాడు. తనతో పాటు తీసుకొచ్చిన ఓ రాకెట్ టపాసులను పేల్చాడు. ఓ పథకం ప్రకారమే రాకెట్ టపాసులు ఆ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ వైపు వెళ్లేలా తన పై ఆ బాక్సును ఉంచాడు. దీంతో ఆ క్రాకర్స్ ఒక దానివెంట మరొకటి ఆ భవనం వైపు రాకెట్ల దూసుకెళ్లాయి. దీంతో ఆ భవనంలోని వారు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతోంది. ఉక్రెయిన్ మీద రష్యా బాంబుల దాడి చేసినట్లు ఈ పోకిరి వెదవ ఆ అపార్టమెంట్ వారిపై ఈ రాకెట్ టపాసులను ప్రయోగించాడు.
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న వీడియోను చూసినట్టు అయితే ఆ యువకుడు కావలనే ఓ ఫ్లాట్ వైపు వెళ్లే విధంగా రాకెట్స్ టపాసులను అపార్ట్మెంట్ వైపు కాల్చినట్లు తెలుస్తోంది. థానే జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లకు ఈ వీడియోను షేర్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని,త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే తాగిన మైకంలో అలా చేసి ఉండొచ్చని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం దీపాళి రోజున జరిగిన ఫన్నీ వీడియో ఇదే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ठाण्यात तरुणाने लोकांच्या घरात सोडले रॉकेट्स; पोलिसांकडून शोध सुरू. pic.twitter.com/OWrY6dNqc6
— News18Lokmat (@News18lokmat) October 24, 2022