జనన, మరణాలు రెండు మన చేతుల్లో ఉండవు. కేవలం వర్తమానంలో జీవిచడమే మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు, ఎలా, ఎవరిని మృత్యు..తన ఒడిలోకి తీసుకుంటుందో అర్ధంకాదు. ఆరోగ్యగా ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యు కౌగిలోకి వెళ్తారు. తాజాగా ఓ భరత నాట్య కళాకారుడు తన కుమార్తెతో కలిసి భరతనాట్యం చేస్తూనే గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన తమిళనాడు మదురైలో జరిగింది.
తమిళనాడులోని మధుర లోని ఓ ప్రాంతంలో పంగుని ఉతిర పండుగ సందర్భంగా ఓ ఆలయం వద్ద భరతనాట్య గురువు కాళిదాస్(54)తో ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కుమార్తె సహా మరికొందరితో కలిసి నాట్యం చేస్తున్న సమయంలో ఆయనకు అలసటగా అనిపించింది. పక్కకు వచ్చేసి కుర్చీలో కూర్చుని, నీళ్లు తాగారు. కళ్లు మూసుకుని ఉండే సరికి విశ్రాంతి తీసుకుంటున్నాడని అందరూ భావించారు. భరతనాట్య ప్రదర్శన పూర్తయిన అనంతరం అక్కడి వారు పిలిస్తే స్పందించలేదు. కుర్చీలో కూర్చున కాళీదాస్ వద్దకి ఆయన కూతరు వచ్చి డాడీ..డాడీ అంటూ పిలిచినా పలకలేదు. చివరికి స్థానిక వైద్యలు పరిక్షించి కాళిదాస్ మరణించాడని తెలిపారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.