తాము అభిమానించే నాయకులపై ఎవరైనా నోరు జారినా.. దాడులు చేసినా కార్యకర్తల, అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా గుజరాత్ తీవ్ర ఉత్రక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖేర్గాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన అనంత్ పటేల్ పై కొంత మంది దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అభిమానులు వేల సంఖ్యలో వచ్చి అనంత్ పటేల్ కి మద్దతు పలికారు.. ఈ క్రమంలో అక్కడ ఉన్న షాపులకు నిప్పు పెట్టి దాడికి పాల్పపడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన తెలిపారు.
దుండగులు జరిపిన దాడిలో ఎమ్మెల్యే అనంత్ పటేల్ తలకు తీవ్ర గాయం అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఒక మీటింగ్ కోసం ఖెర్గాం కు వెళ్తున్న సమయంలో జిల్లా పంచాయతీ చీఫ్ అతని అనుచరులు తన వద్దకు వచ్చి చాలా నీచంగా మాట్లాడారని.. నువ్వు ఒక ఆదివాసి నాయకుడివి కావడం వల్లనే ఎమ్మెల్యే అయ్యావని దుర్భాషలాడారని అన్నారు. ఆ తర్వాత తన కారును ధ్వంసం చేయడమే కాక తనపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయకపోతే పద్నాలు జిల్లాల హైవేలు అష్టదిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు పై విమర్శలు చేస్తే వారిపై దాడులు చేయడం లేదా జైళ్లకు పంపించడం జరుగుతుందని విమర్శించారు.
Gujarat | Huge crowd of protesters gather in support of Congress MLA & tribal leader Anant Patel who was allegedly attacked by some unknown individuals at Khergam town in Navsari district on Oct 8th
Protestors set ablaze a shop & vandalized the fire tender which reached the spot pic.twitter.com/fFoFTFSEBv
— ANI (@ANI) October 8, 2022