మందు బాబులకు గుడ్ న్యూస్ అందుతోంది. మార్కెట్‌లోకి ఏటీఎంల వలే మద్యం మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుంది.
మందుబాబులకు శుభవార్త అందుతోంది. మార్కెట్‌లోకి ఏటీఎంల వలే మద్యం మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరకంగా మందు బాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సమయం దాటితే వైన్ షాప్స్ మూసేస్తారేమో..? అన్న బెంగ తప్పుతుంది. కాకుంటే ఇది మనదగ్గర కాదు. చెన్నైలో.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చెన్నైలోని ఓ మాల్ వెలుపల ఆటోమేటిక్ లిక్కర్ డిస్పెన్సింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసింది. దీంతో మందుబాబులు ఆ ఏటీఎం ముందు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషీన్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ మెషీన్ల ద్వారా ఎనీ టైం మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. మనం డబ్బు విత్ డ్రా చేసుకునే ఏటీఎం మెషిన్ల వలే ఇవి పనిచేస్తాయి. ముందుగా మెషీన్లలో స్క్రీన్ పైన కనిపించే బ్రాండ్లలో మనకు కావాల్సి దానిని ఎంచుకోవాలి. ఆ వెంటనే దాని ధర డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ పేమెంట్ (కార్డు/యూపీఐ) రూపంలో చెల్లించాలి. అనంతరం మెషీన్ కింది భాగంలో ఏర్పాటు చేసిన ద్వారం నుండి మనం ఎంపిక చేసుకున్న బ్రాండ్‌కు సంబంధించిన మద్యం సీసా బయటకు వస్తుంది. చాలా ఈజీ కదా! మీరు కూడా చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మెషీన్లు మన తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అంటారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A liquor vending machine that has been introduced by Tasmac in Chennai. This is at an Elite Shop inside a mall @THChennai pic.twitter.com/gZlb1D3Gnt
— Sangeetha Kandavel (@sang1983) April 28, 2023