‘ఎవరన్నారు.. భర్తలు తమ భార్యలను కొట్టడం తప్పని! కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. భార్యలు భరించాల్సిందే’… ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన వ్యాఖ్యలు కాదు. భార్యలపై ఆధిపత్య ధోరణితో ఉన్న కొందరు మగ మహారాజులు సమర్థించుకున్న మాటలు అంతకన్నా కాదు. ఇది స్వయంగా మహిళా లోకం చెప్పిన మాటలు. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లోని మెజార్టీ మహిళల అభిప్రాయం. 14 రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 30 శాతం మంది మహిళలు భర్తలు భార్యను కొట్టడాన్ని వెనకేసుకొచ్చారు. భార్యను భర్త కొట్టడం సమర్థనీయమేనా? అనే ప్రశ్నకు ఎక్కువ శాతం మహిళలు సమర్థనీయమే అని తెలిపారు. అయితే కొట్టడానికి గల పరిస్థితులని భార్యలు కలిపిస్తే వారిదే తప్పని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితిలో భార్యలను కొట్టడం తప్పుకాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ వివరాలను వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఈ నివేదికలోని మరో విశేషం ఏంటంటే.. భార్యలను కొట్టే భర్తలను సమర్థించడంలో తెలుగు రాష్ర్టాల మహిళలు ముందున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మహిళల్లో 84 శాతం మంది.. మొగుడు- పెళ్లాన్ని కొట్టడం సమర్థించారు. ఆ తరువాతి స్థానంలో కర్ణాటక మహిళలు 77శాతంతో సమర్థించారు. ఆ తర్వాత మణిపూర్(66శాతం), కేరళ (52శాతం), జమ్ముకాశ్మీర్(49శాతం), మహారాష్ర్ట (44 శాతం), పశ్చిమబెంగాల్( 42 శాతం) ఉన్నాయి. ఈ సర్వేలో హిమాచల్ ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక్కడి 14.2 శాతం మంది మహిళలు మాత్రమే ఆ వ్యాఖ్యలను సమర్థించారు.
గృహహింస కేసులతో అల్లాడిపోతున్న భర్తలకు ఈ సర్వే చాలా సంతోషానిచ్చే విషయాన్ని వెల్లడించింది. ప్రతి చిన్న గొడవకు 498ఏ, 498బి వంటి దారుణమైన కేసులు భార్యలు భర్తల మీద వారి కుటుంబ సభ్యుల మీద పెడుతున్నారు. ఎక్కడో కొందరు భర్తలు భార్యల పట్ల దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ సమాజం తప్పు ఎవరిదైనా భర్తనే విలన్ గా చూపిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
మొగుడు తమ పెళ్లాన్ని ఈ సందర్భాల్లో చేయి చేసుకుంటే మీరు సమర్థిస్తారు అని అడిన సర్వే ప్రశ్నలకు వారు అధిక శాతం మహిళలు సమర్థిచారు. సర్వేలో అడిని ప్రశ్నలు.. ఇల్లు.. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే భార్యలను భర్త కొడితే మీరు సమర్థిస్తారా? భర్త సోదరులను గౌరవించని భార్యలను, ఇంట్లో పెద్దవారి పట్ల చిన్నచూపు భావన ఉన్న భార్యలను కొట్టే భర్తలను సమర్థిస్తారా అనే ప్రశ్నలకు సమర్థింస్తామని మహిళలు తెలిపారు. కానీ ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సర్వేలో భార్యను కొట్టడం సరైంది కాదని ఎక్కువ శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో వెలుగు చూసిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.