ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని భయాన్ని పుట్టించే విధంగా.. కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. కొంత మంది చేసే పనులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో పేరు సంపాదించడానికి యూట్యూబర్స్ రక రకాల వీడియోలు చేస్తుంటారు. ఓ యూట్యూబర్ చేసిన పని చూసి అందరూ షాక్ తినడమే కాదు.. ఇదెక్కడి పిచ్చిరా బాబూ అనుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన పనేంటో తెలుసుకుందాం..
దేశం మొత్తం దీపావళి వేడుకు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటి ముందు దీపాలు వెలిగించి.. పటాసులు కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఏ పండుగ జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం లేకపోవడంతో అందరూ సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. అయితే రాజస్థాన్ లో ఓ యూట్యూబర్ చేసిన పని అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఎప్పుడూ టపాసులు కాల్చే విధంగా కాలిస్తే కిక్కు ఏముందని అనుకున్నాడో ఏమో.. ఈసారి వెరైటీగా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాడు అల్వార్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్.
ఒక కారుకి లక్ష వరకు మిర్చీ టపాసులను పద్దతి ప్రకారం అలంకరించి ఉంచాడు. తర్వాత వన్.. టూ.. త్రీ అని లెక్కిస్తూ కాల్చాడు. లక్ష టపాసులు పేలడంతో ఆ ప్రాంతం అంతా శబ్ధంతో మారు మోగింది. పటాకులు పేలిన తర్వాత కారు రూపు రేఖలు మొత్తం విచిత్రంగా మారిపోయాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ కారు ఇంజన్ కి ఏమీకాలేదు. ఈ సీన్ మొత్తం వీడియో తీసిన అమిత్ మళ్లీ ఆ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేసి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదేం పిచ్చి ఆనందం రా నాయనా అని.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటూ కొంత మంది ఈ వీడియోపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.
ఈ మద్య యూట్యూబర్స్ తమ వీడియోలు వైరల్ కావడానికి ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ శర్మ కూడా దీపావళి పండుగ రోగు అందరినీ ఆకర్షించడానికి కారుకి పటాలుసులు పెట్టి కాల్చే వీడియో తీసినట్లు తెలుస్తుంది. ఈ మద్య సెకండ్ హ్యాండ్ కార్లు అతి తక్కువ ధరలో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వెరైటీ వీడియో ద్వారా అమిత్ శర్మకు బాగానే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
#Watch: Ahead of Diwali, this Youtuber sets car on fire by covering it with firecrackers, video goes viral #ViralVideo #Diwali
Video Courtesy: Crazy XYZ pic.twitter.com/oUixu6f5sR
— NewsMobile (@NewsMobileIndia) October 23, 2022