అదృష్టం.. మూడు అక్షరాల ఈ పదం మనిషికి జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. అయితే ఎవరి జీవితంలోకి ఎప్పుడు ఈ అదృష్ట లక్ష్మి వస్తుందనేది చెప్పలేము. కొందరికి జీవిత ప్రారంభంలో రావచ్చు, మరికొందరికి మధ్య వయస్సులో రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే చాలా మంది జీవితమంతా కష్టాలతో వెలదీసి.. ముంగిపు దశలో ఉన్న సమయంలో ఈ దేవత పలకరిస్తుంది. ఇక జీవితంపై ఎటువంటి ఆశలు లేని ఆ వృద్ధాప్య దశలోనూ కొందరిని అదృష్టం పలకరిస్తుంది. అచ్చం అలాంటి ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. జీవితంలో ఎన్నో ఆటుపోటులు చూసిన ఓ వృద్ధుడికి అదృష్టం వరించింది. లాటరీ తగలడం వలన రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యారు. ఈ విషయం తెలిసిన అయన బంధువులు, ఇతర స్థానికులు క్యూ కడుతున్నారు. మరి.. ఆ అదృష్ట వృద్ధుడి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లాలోని త్రివేది క్యాంప్ అనే గ్రామంలో మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహంత్ ద్వారకా దాస్ కు ఓ మనుమడు కూడా ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడి ద్వారకా దాస్.. కుమారుడు నరేంద్ర కుమార్ ను పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు జీవితం చివరి దశలో చాలా ప్రశాంతంగా కడుపుతున్నాడు. అయితే ఆయనకు లాటరీలపై చాలా ఆసక్తి ఉండేది. దీంతో తరచూ లాటరీ టికెట్లు కొనేవాడు. అలా ఎన్ని సార్లు లాటరీలను కొనుగోలు చేసిన కూడా అదృష్టం ఆయన్ను పలకరించలేదు. అలానే కొన్ని రోజుల క్రితం మహంత్ దాస్ మనవడు నిఖిల్ శర్మతో జాకీర్ పూర్ పంచకుల రోడ్డు ప్రాంతంకి వెళ్లారు. అక్కడే ఉన్న లోకేశ్ లాటరీ షాపులో మనవడు టికెట్ కొనిపించాడు. అయితే ఇటీవలే తీసిన లక్కీ డ్రాలో మహంత్ దాస్ లాటరీ టికెట్ నంబర్ వచ్చింది.
ఈ విషయాన్ని ఆ లాటరీ షాపు ఓనర్.. బ్యాండు మేళంతో వెళ్లి మరీ మహంత్ దాస్ కు విషయం చెప్పాడు. ఆ వృద్ధుడికి రూ.5 కోట్లు ఈ లాటరీలో గెలుచుకున్నాడు. లాటరీ షాపు ఓనర్ లోకేశ్.. మహంత్ దాస్ కు పూల మాల వేసి.. స్వీట్ తినిపించి మరీ.. ఈ విషయం చెప్పాడు. ఈ వార్తతో దాస్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. త్రివేది క్యాంప్ గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో దాస్ ఇంటికి క్యూ కడుతున్నారు. వృద్ధాప్యంలో అదృష్ట లక్ష్మి పలకరించడంతో అందరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక గెలుచుకున్న ఈ సొమ్ములో టాక్స్, ఇతర ఖర్చులు పోను మిగిలినది మహంత్ ద్వారక దాస్ కు వస్తుందని షాపు యజమాని తెలిపాడు. తాను ఇన్నేళ్లు కష్టాల కడలి ఈదుతూ ఉంటే.. జీవితం చరమాకంలో అయినా అదృష్ట లక్ష్మి పలకరించడం సంతోషంగా ఉందని మహంత్ ద్వారకా దాస్ తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.