Narendra Modi: దేశాన్ని పాలించే రాజైనా.. పూట గడవని పేదైనా.. ఓ మంచి మనిషికి.. తల్లంటే ప్రాణ సమానం. కొంతమంది తల్లి కోసం ఏదైనా చేసేస్తుంటారు. ప్రాణాలకు సైతం లెక్కచేయరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లంటే ఏంతో ప్రేమ. చాలా సందర్భాల్లో తన తల్లి మీద ప్రేమను చాటి చెప్పే పనులు చేశారు. తాజాగా, తల్లి ఫొటో కోసం ఏకంగా సెక్యూరిటీ ప్రొటోకాల్ రూల్స్‌ను బ్రేక్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే… తమ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సిమ్లాలో పర్యటించారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ర్యాలీ నిర్వహించారు. కారులోనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ చోట కారులోంచి కిందకు దిగి అక్కడి ఓ మాల్‌పైనుంచి ప్రజలను పలకరించారు. కొద్దిసేపటి తర్వాత ఆ గుంపులో ఓ మహిళ మోదీ తల్లి ఫొటో పట్టుకుని కనిపించింది. తల్లి ఫొటో చూడగానే ఆయన ఎమోషనల్ అయ్యారు. తన సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను సైతం లెక్క చేయకుండా ఆమె దగ్గరకు వెళ్లిపోయారు. ఆమె చేతిలోని ఫొటోను బహుమతిగా స్వీకరించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి అక్కడినుంచి సాగిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ప్రధానికైనా తల్లి తల్లే కదా..’’.. ‘‘ తల్లంటే ఎవరికి మాత్రం ప్రేముండదు’’.. ‘‘ ప్రధాని మోదీకి తల్లంటే ఎంత ప్రేమ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
राष्ट्रनायक की यही पहचान
जन-जन को देते सम्मानप्रधानमंत्री श्री @narendramodi जी ने शिमला आगमन पर अपनी गाड़ी रुकवाकर हिमाचल की बेटी द्वारा बनाई गई पेंटिंग स्वीकार की और बेटी को आशीर्वाद दिया।#8YearaOfGaribKalyan pic.twitter.com/57Und7f8Kd
— BJP Himachal Pradesh (@BJP4Himachal) May 31, 2022
ఇవి కూడా చదవండి : Tamil Nadu: అదృష్టం అంటే వీళ్లది.. బంధువుల కోసం వెళ్లి రూ.10 కోట్ల జాక్ పాట్ కొట్టేశారు!