ఈ మద్య ఈజీ మనీ కోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొంత మంది కేటుగాళ్లు. ముఖ్యంగా అడవారితో అసభ్యకరమైన నృత్యాలు వేయించడం… వారితో వ్యభిచారం చేయించడం లాంటివి చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఈ హైటెక్ వ్యభిచారాలు చాలా తెలివిగా చేస్తూ పోలీసుల కు చిక్కకుండా ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు వీళ్ల గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. తాజాగా కొంతమంది యువతులతో డ్యాన్సులు చేయిస్తున్న బార్ గుట్టు రట్టు చేశారు ముంబయి పోలీసులు. అంధేరీలోని దీప బార్లో సోషల్ సర్వీస్ విభాగ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బార్ బేస్మెంట్ గోడలో 17 మంది యువతులను గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అంధేరీలోని దీప బార్. నిబంధనలకు వ్యతిరేకంగా బార్లో యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే సోషల్ సర్వీస్ విభాగ పోలీసులు రాత్రి 11.30 తర్వాత తనిఖీలు చేశారు. పోలీసుల రాకను గమనించిన డాన్సర్లు, బార్ సిబ్బంది అక్కడి నుంచి మెల్లిగా పరారయ్యారు. బార్ లోపలికి వచ్చిన పోలీసులు.. ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టోరేజీ గదులు, వంటశాలలు సహా గదులన్నింటినీ తనిఖీ చేశారు. కానీ వారికి ఎలాంటి ఆధారాలు.. ఎవరూ కనిపించలేదు.
ఇదీ చదవండి : బయటకు వచ్చిన మహిళపై యువకుడు కన్నేస్తూ ఆపై దారుణం!
ఈ క్రమంలో వారికి ఓ అద్దంపై అనుమానం కలిగింది.. వెంటనే దాన్ని పగులగొట్టి చూసిన పోలీసులు ఒక్కసారే షాక్ తిన్నారు. మొత్తం 17 మంది డ్యాన్సర్లు అందులో దాక్కున్నారు. ఈ రహస్య గదిలో ఏసీలు, శీతల పానీయాలు, ఆహార ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బార్ మేనేజర్, క్యాషియర్‌తో పాటు 17 మంది డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు.
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021
Deepa Bar Andheri pic.twitter.com/dJeGm5YDbI
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021