సాధారణంగా కోతుల అల్లరి మాములుగా ఉండదు. కోతులు కొన్ని సార్లు అచ్చం మనుషులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తుంటాయి. అందుకే కొంతమంది పిల్లలను కోతి చేష్టలు చేస్తారని అంటుంటారు. గత కొంత కాలంగా అడవుల్లో చెట్లు నరికి వేయడంతో కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఒక్కసారి మన ఇంట్లోకి కోతులు వచ్చాయంటే.. ముప్పతిప్పలు పెడతాయి. ఆ సమయంలో వాటి జోలికి వెళ్లాలంటే భయపడిపోతారు.
ఇక కోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు.. మనం తినే ఆహార పదార్ధాలు, వస్తువులు ఎత్తుకు వెళ్తాయి. కోతులు గుంపులుగా ఉంటాయి.. కొన్నిసార్లు కొట్టుకొని తీవ్రంగా గాయాలపాలవుతాయి. అలా ఓ కోతి తీవ్రంగా గాయాలపాలైంది. కానీ ఆ కోతి అచ్చం మనిషిలా ఆలోచించి హాస్పిటల్ కి వెళ్లి మరీ ట్రీట్ మెంట్ చేయించుకుంది. దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!
ఒక కోతికి విపరీతంగా గాయాలు అయ్యాయి. అయితే ఆ కోతిపై ఇతర కోతులు దాడి చేశాయా? లేదా వాహనాలు ఢీ కొని గాయపడిందా? అన్న విషయం తెలియదు. ఆ కోతికి పిల్ల కూడా ఉంది. తల్లి కోతి ముఖానికి, శరీరానికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అంత గాయపడినా కోతి సమయస్ఫూర్తిని ప్రదర్శించింది.. మనుషులకు ట్రీట్ మెంట్ చేయడం గమనించి తన పిల్లను తీసుకొని హాస్పిటల్ కి చేరుకుంది. అక్కడ దీనంగా కూర్చొని ఉన్న కోతిని చూసిన డాక్టర్ దాని వద్దకు వెళ్లి లోపలికి తీసుకు వచ్చి ట్రీట్ మెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
ఆ కోతి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కల్గించలేదు. సైలెంట్ గా చికిత్స చేయించుకొని.. కొద్ది సేపు అక్కడే విశ్రమించింది. కోతికి ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో చాలా మంది గమనించి తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనుషులు కూడా ఇంత శ్రద్దతో బుద్దిగా ట్రీట్ మెంట్ చేయించుకోరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే కోతి అయినా ఎలాంటి భయం లేకుండా డాక్టర్ వైద్యం చేయడం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5
— manish (@manishndtv) June 8, 2022