వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. కొంతమంది కొత్తగా పెళ్ళయిన జంటలు కూడా తమ భాగస్వామి ప్రవర్తన ఇష్టం లేకపోతే వెంటనే పెడదారి పడుతున్నారు. వందేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. అటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. వేరే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఆ సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు. కానీ ఆ భార్య మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో కోపం వచ్చిన భర్త ఆవేశంతో ఆమెను గొంతు కోసి చంపాడు.
ఈ హోసూరు ఎంజీ రోడ్డుకు చెందిన జ్యోతిష్ బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి బెంగళూరు సమీపంలోని జిగణికి చెందిన వందనతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ నెల 21వ తేదీన వందన తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. అయితే ఇటీవల భర్త కరోనా సోకినప్పుడు షాపులో పనిచేసే సుగిల్ అనే యువకునికి ఆమె దగ్గరైంది. భర్త గట్టిగా ప్రశ్నించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత తానే వస్తుందిలే అని భర్త అనుకున్నాడు. కానీ ఆ మహిళ మాత్రం భర్తను కాదని తల్లి గారి ఇంటినుండే సుగిల్ తో పరారైంది. ఆమెను భర్త ఈ నెల 15వ తేదీన తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ గొడవలు జరగడంతో తనను భార్యను కత్తితో గొంతుకోసి చంపినట్లు నిందితుడు తెలిపాడు.
అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు భర్తను జైలుకు తరలించారు. ఇది ఆమె సంసారంలో చిచ్చు రేపింది. భార్య తీరును గట్టిగా ప్రశ్నించిన భర్త తీరుతో ఆమె చెప్పాపెట్టకుండా సుగిల్ లో వెళ్లిపోయింది. దీంతో.. ఆమె కోసం వెతికిన జ్యోతిష్ ఆమెను వెతికి ఇంటికి తీసుకొచ్చారు. ఇరువురి మద్య మొదలైన వాదులాట గొడవగా మారింది. దీంతో ఆవేశానికి గురైన జ్యోతిష్ భార్య గొంతు కోసి చంపేశాడు. దీంతో..జ్యోతిష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దర్యాప్తు మొదలైంది.