దేశంలో రైలు ప్రమాదాలను తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భల్లో ట్రాక్ తప్పి ప్రమాదాలు జరుగుతుండగా.. మరికొన్ని సందర్భల్లో ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు.. ఎదురెదురుగా ఢీ కొడితే జరిగే నష్టం ఊహకందనిది. ఈ ఘటనలు కొన్ని సందర్భాల్లోనే జరుగుతున్నా నష్టం మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. ఈ ప్రమాదాల్లో అనేక మంద్రి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఇండియన్ రైల్వేస్.. ప్రత్యేక సాఫ్ట్ వేర్ కవచ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
రైల్వే వ్యవస్థలో సున్నా ప్రమాదాలే లక్ష్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైనన్ ప్రొటెక్షన్ వ్యవస్థను రైల్వేలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిదిలోని సికింద్రాబాద్-వాడి-ముంబై మార్గంలో మొదటగా ఈ కవచ్ రక్షణ వ్యవస్థను అమలులోకి తేనున్నారు. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌ను ఈ కవచ్ పరిధిలోకి తెచ్చారు. ఈ క్రమంలో కవచ్ రక్షణ వ్యవస్థ పనితీరును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు. ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా రైళ్లు ఆగిపోవడాన్ని ప్రత్యక్షంగా చూశారు.
కవచ్ రక్షణ వ్యవస్థ పనితీరు
కవచ్ రక్షణ వ్యవస్థనే ట్రైన్ కొల్లిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) లేదా ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ATP) అని కూడా అంటారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చుతారు. ఈ సెన్సార్ల వల్ల ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా వచ్చిన సందర్భాల్లోను, ఒకదాని వెనుక మరొకటి వేగంగా వస్తూ.. ఢీ కొట్టే సందర్భాల్లో ఇవి ఆటోమేటిక్ గా పని చేస్తాయి. ప్రమాదాలను ముందే పసిగట్టే వ్యవస్థలు రైళ్లను ఆటోమేటిక్ గా ఆపేస్తాయి. అంతే కాదు.. రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా రైలు దూసుకువస్తుంటే వెంటనే కవచ్ రక్షణ వ్యవస్థ ఆక్టివేట్ అయ్యి.. ట్రైన్ వేగాన్ని ఒక్కసారిగా నిలిపేస్తుంది. ఈ వ్యవస్థ అధిక ఫ్రీక్వేన్సి రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీతో పనిచేస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
Between Gollaguda – Chitgidda in Secunderabad to Vikarabad section pic.twitter.com/pXbu7RtgCg
— Rajendra B. Aklekar (@rajtoday) March 4, 2022
రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించాలన్న లక్ష్యంతో 2022 యూనియన్ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత 2 వేల కిలోమీటర్ల పరిధిలో రైల్వే నెట్‌వర్క్‌ను కవచ్ రక్షణ వ్యవస్థ కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టు కింద 1098 కి.మీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 65 లోకోలలో ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Railway Minister @AshwiniVaishnaw on board: Anti-Collision Device auto-brakes running loco 380m ahead of another loco standing on same tracks. ‘Kavach’, which literally means armour, is being promoted as the world’s cheapest automatic train collision protection system. @mid_day pic.twitter.com/oMFcPrJI8L
— Rajendra B. Aklekar (@rajtoday) March 4, 2022