ప్రస్తుత సమాజంలో ‘ఇసుంట రమ్మంటే.. ఇళ్లంతా నాదే’ అనే రకాలే ఎక్కువ. అందుకే కనిపెట్టారనుకుంటా మన వాళ్లు ఈ సామెతను. అచ్చంగా ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి నోయిడాలో జరిగింది. ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకు.. కిరాయికి ఇస్తే కాస్తో కూస్తో డబ్బులు వస్తాయి కదా అనుకున్నారు ఆ దంపతులు. అలాగే అని ఓ యువతికి ఇల్లు అద్దెకి ఇచ్చారు. అదే వారు చేసిన పొరపాటు. ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది. మరి ఆ యువతి చేసిన నిర్వాకం ఏమిటి? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే..
గ్రేటర్ నోయిడాకి చెందిన సునీల్ కుమార్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పనిచేస్తున్నాడు. అతనికి నోయిడాలోని సెక్టార్ 16బీ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్లో సొంత ప్లాట్ ఉంది. సునీల్ వృత్తి రీత్యా ముంబాయిలో ఉండటంతో ప్లాట్ ను అద్దెకివ్వదలిచాడు. దాంతో అతడు తన ప్లాట్ ను ప్రీతి అనే యువతికి గతేడాది జులైలో అద్దెకి ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 10తో ఆ అగ్రిమెంట్ ముగిసింది. తాజాగా సునీల్ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యారు. దాంతో తిరిగి నోయిడాలోని తన సొంతింటికి రావాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రీతిని ఇల్లు ఖాళీ చేయమని అడిగాడు. అయినప్పటికీ ఆమె ఇల్లు ఖాళీ చేయడం లేదు. దాంతో సునీల్ పోలీసులను ఆశ్రయించగా, అది సివిల్ కేసు కావడంతో కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
దీంతో సునీల్ దంపతులు చేసేది ఏమీ లేక న్యాయపోరాటానికి దిగారు. తమ సామన్లు తీసుకుని సొంతింటి మెట్ల మీద కూర్చున్నారు. ఈ విషయం కాస్తా మీడియాకి తెలియడంతో వైరల్ అయ్యింది. దీంతో సమస్య అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో అధికారులు వచ్చి ఆ యువతిని ఇల్లు ఖాళీ చేయించారు. వారం రోజుల పాటు ఆ దంపతులు చేసిన పోరాటానికి తాజాగా ఫలితం లభించింది. సొంతింటి కొసం ఆ దంపతులు చేసిన న్యాయ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you @ndtv @ashutosh_ashu28 @DeepikaBhardwaj @Helpageindia @ZeeNews @Anjalis09068541 @timesofindia @SGrenowest @aajtak @NCMIndiaa
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/fLuMDKj6Xt
— Rakhi gupta (@Rakhigupta75) July 28, 2022
कितनी बदनाशीबी है हमारी खुद का घर स्काई गार्डेन T-5 F-1505 होते हुए भी हम अपने घर मे सेवानिवृत होने के बाद एक गुंडा प्रवृत्त की टेनंट प्रीति गुप्ता की वजह से नही एंटर कर पा रहे है@dmgbnagar @noidapolice @nefowaoffice @abhishek_nefowa @SGrenowest @GreaterNoidaW @coprajaneesh pic.twitter.com/kYVb20PwDW
— Rakhi gupta (@Rakhigupta75) July 25, 2022
ఇదీ చదవండి: లైవ్ షోలో ప్రమాదం.. ఇద్దరి డ్యాన్సర్లకు గాయాలు..
ఇదీ చదవండి: Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్!