ఇండియన్ క్రికెట్‌లో స్పిన్నర్‌గా తనదైన ముద్రవేసిన హర్బజన్ సింగ్ ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.. అలాగే టీమిండియా సాధించిన అనేక గొప్ప విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, కోల్‌కత్తా జట్లకు ఆడాడు. సుదీర్ఘ కెరీర్ తర్వాత అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఇక తన రెండో ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టాడు భజ్జీ.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పకముందే హర్భజన్ సింగ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని భజ్జీ అప్పటికప్పుడే ఖండించాడు. కానీ.. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ పీసీసీ లీడర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధుతో భేటి అయ్యారు. దీంతో మళ్లీ హర్భజన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. భజ్జీతో భేటి అయిన విషయాన్ని సిద్ధునే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోతో సహా పోస్టు చేశారు. ‘సాధ్యమైయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని ఆ ఫొటో గురించి వివరించారు. దీంతో హర్భజన్ రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించే సిద్ధుతో భేటీ అయినట్లు అర్థం అవుతుంది. దీంతో భజ్జీ కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సిద్ధు పోస్టు తర్వాత కూడా హర్భజన్ ఏం స్పందించకపోవడంతో కాంగ్రెస్‌లో ఆయన చేరిక కన్ఫాం అయినట్లు తెలుస్తుంది. మరికొన్ని వారాల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనే పోటీ చేసి.. రాజకీయంగా స్ధిరపడాలని భజ్జీ భావిస్తున్నట్లు.. అందుకు సిద్ధు కూడా భజ్జీని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి హర్బజన్ రాజకీయ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్లుగా గంగూలీ, ధోని గొప్పతనాన్ని చెప్పిన హర్బజన్ సింగ్
Picture loaded with possibilities …. With Bhajji the shining star pic.twitter.com/5TWhPzFpNl
— Navjot Singh Sidhu (@sherryontopp) December 15, 2021