కుక్కలంటే చాలామందికి ప్రేమ ఉంటుంది. అందుకే వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తుంటారు. కొందరు వీటికి.. ఇంటిలో సభ్యులకు ఉండే సౌకర్యాలు అన్నీ కల్పిస్తుంటారు. అక్కడక్కడ కుక్కకి పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు. ఆ కోవాలోనే ఓ వ్యక్తి భారీగా ఖర్చు పెట్టి తన పెంపుడు కుక్కుకు పుట్టిన రోజు వేడుకలు జరిపించాడు. పోలీసులు సదరు వ్యక్తితో పాటు మరో ఇద్దరి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారు?ఈ వేడుక ఎక్కడ జరిగింది? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
అహ్మదాబాద్ లోని కిరణ్ పార్క్ సొసైటీలో ఉండే సోదరులు చిరాగ్ పటేల్, ఊర్విష్ పటేల్ కు ‘అబ్బీ’ అనే పెంపుడు శునకం ఉంది. ఆ సోదరులు దాని పుట్టిన రోజు వేడుకల చేయాలని భావించారు. దీంతో.. బర్త్డే వేడుకల కోసం రంగు రంగుల విద్యుద్దీపాలు, డీజే, ఫ్లెక్సీలు.. ఇలా అన్ని హంగులతో సంబరాలు చేశాడు. కుక్క పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ పాల్గొన్ని డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పోలీసుల వద్దకి చేరింది. అయితే.., ఇదే వారి కొంప ముంచింది.
ఇది చదవండి : ముసలోడే గానీ.. హర్యానా రాణీతో కలిసి ఇరగదీశాడు
కరోనా సమయంలో అధిక సంఖ్యలో జనాలు గుమ్మిగూడి, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుక జరగడం వల్ల సోదరులతో పాటు, వారి స్నేహితుడు దివ్యేష్ మెహారియాను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వేడుకలో ఎవ్వరూ.. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని తెలిపారు. కాగా, కుక్క పుట్టినరోజు వేడుకల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరి వీరి అరెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.