సాధారణంగా గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. ఈ జంతువులు కొన్నిసార్లు అచ్చం మనుషులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తుంటాయి. ఇక వెండితెరపై కొన్ని జంతువులు చేసే విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఉంటుంది. ఇక కోతులు, గొరిల్లా, చింపాజీలకు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చాయి.. వాటి నటన చూస్తే.. ఔరా అనిపించే విధంగా ఉంటాయి. కొన్ని సార్లు గొరిల్లాలు, చింపాంజీలు చేసే విచిత్రమైన పనులు కడుపుబ్బా నవ్విస్తుంటాయి.
ఒక గొరిల్లా సైకిల్ తొక్కడం మీరు ఎప్పుడైనా గమనించారా? భారీ శరీరంతో ఉన్న ఓ గొరిల్ల చిన్న సైకిల్ తొక్కడం అది కాస్త పడిపోవడంతో దాన్ని విసిరివేసిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్ఎస్ అధికారి పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో గొరిల్లా భలే పని చేసిందే అంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక గొరిల్లా కింద కూర్చొని ఉంది.. అంతలోనే ఒక పెద్ద గొరిల్లా చిన్న సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. కొంచెం దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. ఆ గొరిల్లాకు కోపం రావడంతో సైకిల్ ని ఎత్తి అవతలకి విసిరింది. ఈ వీడియో సామ్రాట్ గౌడ ‘స్టుపిడ్ సైకిల్’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Stupid cycle 😡!!!……….😃 pic.twitter.com/hGXZBEGSL7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 8, 2022