ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు గడ్డుకాలం నడుస్తోంది. రాజకీయంగా ఆ పార్టీకి ఊహించిన షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాని నడుపుతోంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఇటీవలే గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు. తాజాగా గోవాలో సైతం హస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో గోవా రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గోవాలో కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గోవా బీజేపీ ముఖ్యనేత సదానందా సెట్ తనవాడే మాట్లాడుతూ.. హస్తం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భాజపాలోకి చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ మారిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో భేటీ అయినట్లు సమాచారం. బీజేపీలో చేరిన వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్షనేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో గోవా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విధాన సభ స్పీకర్ తో పాటు సీఎం ప్రమోద్ సావంత్‌ను ఆ 8 మంది ఎమ్మెల్యేలు కలవనున్నట్టు సమాచారం.
కాగా,ఇటీవల గోవాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచి.. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. మరోవైపు.. రెండు నెలలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు గోవా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” పేరుతో పాదయాత్ర చేస్తున్న వేళ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీ ఫిరాయించడం గమనార్హం. దీనిపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. దేశాన్ని కాదు ముందు పార్టీని ఐక్యంగా ఉంచుకోవాలని ఎద్దేవా చేసింది. మరి.. గోవాలో జరిగిన తాజాగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Goa chief minister Pramod Sawant holds a meeting with Congress MLAs who will join BJP soon. pic.twitter.com/xvpnmvDRgK
— TOI Goa (@TOIGoaNews) September 14, 2022