షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ షోరూం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ రాత్రి నుంచి తగలబడుతూనే ఉండగా.. ఎలక్ట్రిక్ షోరూంలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆసుపత్రి కిటికీల్లోంచి రోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం, మహారాష్ట్ర, చైనాలోని భారీ అగ్నిప్రమాద ఘటనలు సంభవించాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ షోరూంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 90 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమయ్యాయి. కాగా ఈ మంటలు పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాప్, వైన్ షాప్ కు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా మహారాష్ట్రలో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని ఓరియన్ బిజినెస్ పార్క్ మరియు సినీ వండర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల తీవ్రతకు అక్కడే ఆగి ఉన్న కారు వేడెక్కి బ్లాస్ట్ అయ్యింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వండర్ మాల్ పై 2 అంతస్తులు భారీగా మంటలు చెలరేగాయి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి షాపింగ్ మాల్ తగలబడుతూనే ఉంది. ఇంకా మంటలు ఆరలేదు. రాత్రంతా 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ఘటనలో కార్లు, ఇతర వాహనాలు, ఫర్నీచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక చైనాలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీజింగ్ లోని ఓ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 21 మంది రోగులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రమాదం నుంచి బయట పడేందుకు రోగులు కిటికీల లోంచి దూకారు.
📍Maharashtra | A massive fire broke out in Thane’s Orion Business Park. The fire has been doused now.#OrionBusinessPark #Thane #Maharashtra pic.twitter.com/gLZP4pVp4Q
— Mirror Now (@MirrorNow) April 19, 2023
#BREAKING
.#Beijing: A #hospital building in Beijing’s #Fengtai district caught #Fire, leaving 21 dead and 71 #patients displaced; people used ‘bed sheets’ to escape #BeijingHospitalFire‘; #pakustv #NYC #firefighters #Accident #China pic.twitter.com/YgNFpHzCIv— Ch.Amjad Ali (@saada186) April 18, 2023