భారత్ లో కరోనా కేసుల సంఖ్య నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి కరోనా కేసులు. అయితే దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు భయాందోళన సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నమోదు అవుతున్నాయి. నిన్న తెలంగాణలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 86,415 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో ఇదే పమయంలో 7,886 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 391 మంది కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,41,62,765 కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,76,869 కి పెరిగినట్టు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 1,35,99,96,267 వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 92 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.
ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని, అందుకోసమే కచ్చితమైన పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల ఒమిక్రాన్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా నమోదైన 4 కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు పెరిగింది. విస్తృత వేగంతో వ్యాపించే ప్రమాదమున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే చాలా రాష్ట్రాలకు విస్తరించింది. రానున్న రోజుల్లోనే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా వేసింది. అన్ని రాష్ట్రాలు ఒమిక్రాన్ విషయంలో అలర్ట్ గా ఉండాలని.. ఆంక్షలను కఠినంగా పాటించాలని సూచించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/Ir2luAWaJ8 pic.twitter.com/5mjmp45yky
— Ministry of Health (@MoHFW_INDIA) December 17, 2021