చోటా మోటా వ్యాపారవేత్తలే తమకు అసలు టైం లేదంటూ.. బిజీ బిజీగా గడుపుతుంటారు. అలాంటిది వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన ఆనంద్ మహీంద్రా షెడ్యూల్ ని కనీసం ఊహించలేం. నిత్యం వ్యాపార కార్యక్రమాల్లో తలమునకలయ్యి ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. తన గురించి కన్నా.. స్ఫూర్తిదాయక వ్యక్తులు, సక్సెస్ స్టోరీ ల గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. ఇక టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో ముందుంటారు ఆనంద్ మహీంద్రా.
ఇది కూడా చదవండి : ఫుట్ పాత్ పై బిచ్చగాడి డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా
అలాంటి వ్యక్తికే చిరాకు పుట్టించాడు ఓ నెటిజనుడు. సార్.. మీ మతం ఏంటి అంటూ తలతిక్క ప్రశ్న సంధించాడు. పైగా ‘ఇలా అడగడం తెలివి తక్కువ తనమని నాకు తెలుసు కానీ.. నేను మాత్రం మీరు పంజాబీ అనుకుంటున్నాను.. నిజమా.. కాదా..’ అంటూ తన పైత్యం ప్రదర్శించాడు. ఈ ట్వీట్‌పై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆనంద్ మహీంద్రా మాత్రం చాలా కూల్ గా.. జన్మలో మరోసారి ఇలాంటి తింగరి పని చేయలంటేనే భయపడే రేంజ్లో సమాధానం చెప్పారు.
Not a stupid question but my straight answer is that I’m an Indian.. https://t.co/MrrmP9cGuE
— anand mahindra (@anandmahindra) January 8, 2022
ఇది కూడా చదవండి : ‘ఏం పేస్ట్ వాడుతున్నావ్’.. వైరలవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
సదరు నెటిజన్ ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.. ‘‘నువ్వు అడిగిన ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న ఏం కాదు. కానీ ఇందుకు నా సూటి సమాధానం ఏంటంటే.. నేను.. భారతీయుడిని’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా సమాధానంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంచి సమాధానం ఇచ్చారు సార్.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది తనకు అంటూ ఆనంద్ మహీంద్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.