ఈ రోజుల్లో భూముల కోసం ఎన్నో గొడవలు, కొట్లాటలు జరుతున్నాయి. అయితే ఊరి బాగు కోసం బడి కొరకు తనకున్న భూమిలో కొంత భాగాన్ని సర్కార్‌కి దానంగా ఇచ్చాడు ఓ నిరుపేద రైతు. పిల్లలు చదువుకునేందుకు బడి కట్టడానికి ఓ పేద రైతు గవర్నమెంట్‌కే తన భూమిన దానం చేసిన కలియుగ కర్ణుడు. అతని పేరు శుభోద్ యాదవ్.. బీహార్ కు చెందిన ఆ యువకుని గురించి తెలుసుకుందాం..
ఈ రోజుల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలం వేలల్లో రేటు పలుకుంది. సామాన్యులకు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో చాలా తలకు మించిన భారమవుతోంది. కొంచెం స్థలం కోసం సొంత అన్నదమ్ములనైనా దూరం పెట్టే రోజులివి. ఉన్న భూమిని పంచుకోవడంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తిలో కూడా ఆడపడచులు, అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజుల్లో భూముల గొడవలతో బంధాలను తెగతెంపులు చేసుకుని ఎప్పటికి కలవకుడా విడిపోతున్నారు. అలాంటిది తన కున్న భూమిలో కొంత భాగాన్ని ఊరిలోని బడి కొరకు దానమిచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు ఓ యువకుడు. చివరకు ఆ స్కూల్ పేరు కూడా తన తల్లిపేరు మీదుగా నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్తులంతా ఆ యువకుని మానవతా హృదయానకి ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళితే…
బీహార్ బగల్ పూర్ జిల్లాలోని కహారాపూర్‌లో నివాసముంటున్న శుభోద్ యాదవ్ ఓ రైతు. ఆ యువకుడు చాలా నిరుపేద రైతు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అతనిది. ఈ యువకుడు డబ్బులకు లేనివాడైనా గాని మనసుకు మాత్రం శ్రీమంతుడు అంటున్నారు. ఇంతకీ అతను చేసిన మంచి పని ఏంటంటే.. తమ గ్రామంలో బడి సౌకర్యం లేదని తనకున్న భూమిలో కొత భాగాన్ని బడి కట్టేందుకు దానంగా ఇచ్చాడు. దాదాపు 8 లక్షల విలువజేసే భూమిని అంటే 9 గుంటల భూమిని సర్కార్‌కు దానంగా ఇచ్చాడు. 2020 సంవత్సరంలో వరదల కారణంగా ఊరంతా నీట మునిగిపోయింది.
ఊరిలో ఉన్న బడి కూడా మునిగిపోయింది. అప్పటి నుండి స్కూల్లో ముందున్న సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు, ఆఫీసర్లను ఎంత వేడుకున్నా కొత్త స్కూల్ భవనం కట్టేందుకు ముందుకు రావడంలేదు. దీంతో శుభోద్ యాదవ్, తల్లి చండికాదేవి తమకున్న భూమిలో కొంత భూమిని బడి కోసం గవర్నమెంట్ వారికి ఇచ్చేద్దాం అని నిర్ణయించుకున్నారు. చండికాదేవి, కొడుకుతో బగల్ పూర్ డీఈవో ఆఫీస్‌కి వెళ్లి డీఈవోను కలసి మాట్లాడారు. బడి కోసం తమ భూమి కొంత దానంగా ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
డీఈవో దానికి సమ్మతించి కావలసిన ఏర్పాట్లను తయారు చేశారు. బడి కొరకు ఇచ్చిన జాగను తీసుకుని సర్కార్ బడి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఊరిలో కొత్త స్కూల్ భవనం కడతామని.. దానికి ‘చండికాదేవి విద్యాలయం’ అనే పేరు పెడతామని అధికారులు తెలిపారు. ఈ రోజుల్లో బడికి భూమిని దానమిచ్చాడంటే చాలా గొప్ప విషయమని ఊరంగా శుభోద్ యాదవ్‌ని కొనియాడుతున్నారు. ఈ విధంగా తన గొప్ప మనసు చాటుకున్న శుభోద్ యాదవ్ మంచి పనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.