మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తంలో చేరుతున్న మలినాలను గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషపదార్థాలను ఎప్పటికప్పుడు వడబోస్తూ ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా.

మూత్రపిండాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుట కోసం వైద్యులు సూచించిన సలహాలు పాటించాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్య పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్ లో ఓ పసిపాపకు కీడ్నీ శస్త్ర చికిత్స జరిగింది. ఆధునిక టెక్నాలజీతో వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఎటువంటి ఆరోగ్య సమస్యనేైనా పరిష్కరించి ప్రాణాలు నిలిపుతున్నారు వైద్యులు. ఈ క్రమంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మూడు నెలల మగశిశువుకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు.
పసి బిడ్డకు రెండు మూత్రపిండాల్లో తలెత్తిన సమస్యను తీర్చారు. మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్ర ప్రవాహంలో ఏర్పడిన సమస్యతో పుట్టిన బిడ్డకు మూడు నెల్ల తరువాత ఈ సర్జరీ చేశామని వెల్లడించారు. ఈ సర్జరీని గత సంవత్సరం డిసెంబరులోనే పీడియాట్రిక్ విభాగం నిర్వహించిందని తెలిపారు. సర్జరీ తరువాత పసిబిడ్డను మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని ఎయిమ్స్ ప్రకటించింది. ఆ తరువాత రినో గ్రామ్ పరీక్ష నిర్వహించి సర్జరీ విజయవంతమైందని నిర్థారించుకున్నామని ఎయిమ్స్ ఫ్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ చెప్పారు. కేవలం మూడు నెలల వయసున్న బిడ్డకు కిడ్నీ సర్జరీ చేయడమనేది ప్రపంచంలోనే ఇది తొలిసారి అని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.