సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ఆయన సినిమాలు సాధించే రికార్డ్స్ రూపంలో ఎప్పుడు బయట పడుతుంటాయి. అలాంటి సూపర్ స్టార్ పుట్టినరోజు ఆగస్ట్ 9. దీంతో.., ఇండస్ట్రీలోని అన్నీ వర్గాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సూపర్ స్టార్ మహేశ్ కి బర్త్ డే విషెస్ అందించారు.
“హ్యాపీ బర్త్ డే టు ఎవర్గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి.” అంటూ చిరు టీట్ ద్వారా మహేష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ ని విష్ చేస్తూ.., చిరు ఈ రేంజ్ లో ట్వీట్ చేయడంతో.., ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేశ్ బర్త్ డే ట్రీట్ గా రిలీజ్ అయిన ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Happy Birthday to the Evergreen Charmer SSMB @urstrulyMahesh ! A lethal combo of Style and Substance! Have a Blockbuster year ahead! 💐💐 Many Many Happy Returns!
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2021