దేవుడు ఉన్నాడా? లేడా? ఆస్తికులు ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడని అంటారు. నాస్తికులు దేవుడు లేడని కొట్టి పారేస్తుంటారు. ఇలా ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ.., దేవుడి చేసే మహత్యాలు మాత్రం అప్పుడప్పుడు మనకి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం ద్వారకాధీష్ ఎంతటి దివ్య క్షేత్రమో అందరికీ తెలిసిందే. ఈ ఆలయం సుమారు 2200 సంవత్సరాల పురాతనమైనది. కృష్ణాష్టమి నాడు ఈ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలకి కొన్ని లక్షల మంది భక్తులు హాజరవుతుంటారు. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయం తాజాగా పిడుగుపాటుకి గురి అయ్యింది. ఆలయం పై భాగాన ఉండే జెండా స్థంభాన్ని ఈ పిడుగు తాకింది. అయితే.. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. పిడుగుపాటు జరిగిన సమయంలో కూడా ఆలయంలో చాలా మంది భక్తులు ఉన్నారు. కానీ.., వారెవ్వరికీ ఏమి కాలేదు. ఆలయ గోడలు మాత్రం ఈ పిడుగు కారణంగా నల్లంగా మారాయి.
పిడుగు పవర్ మాములుగా ఉండదు. పిడుగు ఫోర్స్ ని మానవ నిర్మాణం ఏది అడ్డుకోలేదు. అలాంటిది అంత వేగంగా పిడుగు వచ్చి తగిలితే 2200 ఏళ్ళ నాటి ఆలయం నుండి చిన్న రాయి ముక్క కూడా ఉడకపోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఈ ఆలయం చుట్టూ జనావాసం చాలా ఎక్కువ. ఒకవేళ ఈ పిడుగు మాత్రం ఆ ఇళ్ల పై పడి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే.., ఆలయానికి ఎందుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు అంటే ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.
ద్వారకాధీష్ ఆలయం పై భాగాన ఉండే జెండాకి ఓ విశిష్టత ఉంది. దీనిని 52 గజ్ ధ్వాజా అంటారు. భారతదేశంలో 52 గజాల జెండాను రోజుకు 3 సార్లు ఎత్తే ఏకైక ఆలయం ఇదే. అలాంటి జెండాకే మెరుపు తాకడంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ రక్షించాడని భక్తులు కీర్తిస్తున్నారు. ద్వారక ఎస్‌డిఎం నిహార్ భటారియా కూడా.. ఇంత పెద్ద పిడుగుపాటుకి కూడా ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదంటే ఇది ఆ భగవంతుని మాయ కాకుండా.. ఇంకేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలయంపై ఈ పిడుగు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.