SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Jawan Saiteja Funeral Amid Tearful Farewell Ap

కన్నీటి వీడ్కోలు మధ్య అమర జవాన్ సాయితేజ అంత్యక్రియలు

  • Written By: Karunakar Goud
  • Updated On - Mon - 13 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కన్నీటి వీడ్కోలు మధ్య అమర జవాన్ సాయితేజ అంత్యక్రియలు

చిత్తూరు- అమర జవాన్ లాన్స్‌నాయక్‌ సాయుతేజకు కన్నీటి వీడుకోలు పలికారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన 13 మందిలో లాన్స్‌నాయక్‌ సాయుతేజ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సాయితేజ పార్ధివదేహానికి ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదం జరగ్గా, నాలుగు రోజుల తరువాత ఆదివారం మధ్యాహ్నం భౌతికకాయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకుంది.

బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో సాయితేజ పార్ధివదేహం తీసుకురాగా, 30 మంది సైనికులు మూడు ట్రక్కుల్లో సాయితేజ స్వగ్రామానికి చేరుకున్నారు. ఆర్మీ అధికారులు వందన సమర్పణ చేయగా, సైన్యం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించింది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌ కుమార్‌, వెంకటప్పల నాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు హాజరై నివాళి అర్పించారు.

సాయితేజ పార్ధివదేహాన్ని చూసేందుకు ప్రజలు క్యూ కట్టారు. మదనపల్లె నుంచి ఎగువరేగడ వరకూ సుమారు 20 కిలో మీటర్ల మేర ఎన్‌సీసీ కేడెట్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజాసంఘాలు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని అడుగడుగునా నీరాజనం పలికారు. జై జవాన్‌, భరతమాత ముద్దుబిడ్డ సాయితేజ అమర్‌ రహే.. అంటూ జాతీయ జెండాలతో పెద్దఎత్తున నినాదాలు చేశారు.

సాయితేజ అంతియాత్ర సందర్బంగా ప్రజలు రోడ్డు వెంబడి పూల వర్షం కురిపించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మానవహారం తరహాలో రోడ్డు వెంట జనహారతి పట్టారు. ఇక మదనపల్లె పట్టణంలోకి ప్రవేశ మార్గమైన బసినికొండ బోర్డు నుంచి యువత స్కూటర్లపై భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలో 2కిలో మీటర్ల దూరాన్ని దాటడానికి గంటన్నర సమయం పట్టింది. ర్యాలీ సాగినంత సేపు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

ఎగువరేగడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో ప్రజల సందర్శనార్థం సాయితేజ భౌతికకాయాన్ని గంటన్నర పాటు ఉంచారు. అంబులెన్స్‌ గ్రామానికి చేరుకోగానే కుటుంబ సబ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సాయుతేజ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక భార్య, పిల్లల ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్‌, భార్య శ్యామల, పిల్లలు, తమ్ముడు మహేష్ బాబు నివాళి అర్పించారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేయడంతో ప్రజలు కాలినడకన అంత్యక్రియలకు హాజరయ్యారు.

Tags :

  • Andhra Pradesh
  • Eguvaregada
  • Funeral
  • Saiteja
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam