'భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య..' ఆహా.. ఎంత మంచి ఇల్లాలు ఈ భార్య అనుకుంటున్నారా..? అలా అనుకోవడంలో తప్పులేదు కానీ ఇలాంటి ఆఫర్ మాకెందుకు రాదు అనుకోవడంలో మాత్రం తప్పుంది. కావున మగజాతి ఆణిముత్యాలైన మీరు అలాంటి ఆలోచనలు మాత్రం చేయకండి. ఈ ఇల్లాలు ఎందుకిలా చేసిందో తెలుసుకుంటే.. ఆశ్చర్యపోవడం మీ వంతువుతుంది.
భార్య దేన్నైనా సహిస్తుంది కానీ.. సవతి పోరును సహించదు అని అంటుంటారు. కానీ, ఈ ఉత్తమ ఇల్లాలు తన భర్త శారీరక ఆనందం కోసం.. ఏ భార్య చేయని పని చేసింది. మరో మహిళను తీసుకొచ్చి తన భర్తకు బహుమతిగా ఇచ్చింది. అంతేకాదు.. ముగ్గురూ కలిసి బెడ్ షేర్ చేసుకుంటూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వినడానికి ఇది కంపరంగా ఉన్నా పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కతిని పాలో అయ్యే వారు వీధికో పది మంది ఉంటారు. కావున ఆమెను కించపరచడం మానేసి.. ఎందుకిలా చేసిందో తెలుసుకోండి.
అమెరికాకు చెందిన తెహ్మీనా, బ్రయంట్ ఇద్దరూ భార్యాభర్తలు. పెళ్లయ్యాక ఐదేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం బాగానే గడిచింది. అనంతరం కాలం గడిచే కొద్దీ బ్రయంట్ ప్రవర్తనలో మార్పొచ్చింది. భార్యను దూరం పెడుతూ వచ్చిన అతడు మరో మహిళతో అఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెహ్మీనా అతని ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించింది. అయినప్పటికీ అతడు మాత్రం మాత్రం అలానే కొనసాగించాడు. ఈ విషయపై ఇద్దరి మధ్య ప్రతి రోజూ గొడవలు. చివరకు వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. అప్పుడే తెహ్మీనా మనసులో ఓ ఆలోచన తట్టింది. పరాయి మహిళల వెంట పడి తన భర్త చెడిపోకూడదు అనుకుంది. ఎలాగైనా తన వివాహా బంధాన్ని కాపాడుకోవడానుకుంది.
అందుకు ఆమె ముందున్న ఏకైక మార్గం.. తన భర్తకు తనే ఓ తోడు చూడటం. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పుడే ఆస్ట్రేలియాకు చెందిన కైరా( 29) తన కంటపడింది. ఆమె కూడా దాదాపు తెహ్మీనాలాగానే ఉండటంతో ఎలాగైనా తనను ఒప్పించి భర్తకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. ఆ విషయాన్ని కైరాకు చెప్పగా, తాను అందుకు అంగీకరించింది. ఇంకేముంది.. ఇంటికి తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటూ తన భర్తకు బహుమతిని అందించింది. ప్రస్తుతం ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. ఈ విషయంపై తెహ్మీనా మాట్లాడుతూ.. తాము ముగ్గురం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని చెబుతోంది. తన భర్తకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, అది నేను అతనికి ఇస్తాను.. అని చెబుతోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.