WWE: డబ్ల్యూడబ్ల్యూఈ అంటే తెలియనివాళ్లు ఉండరు. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద దాకా ఈ షోను ఫాలో అవుతుంటారు. ఈ షో ఫేక్ అన్న ఆరోపణలు ఎన్ని వచ్చినా దానికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొన్న చాలా మంది ఫైటర్లు ఇప్పుడు స్టార్ హీరోలుగా సైతం మారారు. ఎంతో మంది ఫైటర్లకు జీవితాలను ఇచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ షోలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ మాజీ ఉద్యోగినితో రాసలీలల ఆరోపణల నేపథ్యంలో సంస్థ సీఈఓ, ఛైర్మన్ విన్స్ మెక్‌మ్యాన్ తన పదవినుంచి తప్పుకున్నారు. గత బుధవారం ఈ రాసలీలల విషయంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ స్టోరీ ప్రచురించింది. విన్స్ మెక్‌మ్యాన్ ఓ మాజీ ఉద్యోగినితో ఎఫైర్ నడిపాడని, అది బయటకు చెప్పకుండా ఉండేందుకు 3 మిలియన్ల డాలర్లు ఇచ్చాడని పేర్కొంది.
దీంతో డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ దీనిపై దృష్టి సారించింది. విన్స్ మెక్‌మ్యాన్ రాసలీలల ఆరోపణలపై దర్యప్తు చేపట్టాలని డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విన్స్ మెక్‌మ్యాన్ తన పదవులనుంచి తప్పుకున్నారు. అయితే, దర్యాప్తు జరుగుతున్నంత కాలం విన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ కంటెంట్‌కు సంబంధించిన విధులు నిర్వర్తిస్తారని కంపెనీ స్పష్టం చేసింది. ఇక, డబ్ల్యూడబ్ల్యూఈ ఆపద్ధర్మ సీఈఓగా.. చైర్మన్‌గా విన్స్ కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. మరి, విన్స్ మెక్‌మ్యాన్ రాసలీలల ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అప్పట్లో టాప్ యాంకర్… ఇప్పుడు వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ జీవనం!