అదృష్ట లక్ష్మి ఎప్పుడు ఎవరి తలుపు తట్టుతుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంత కష్టపడినా చాలీచాలని జీవితాలను గడపాల్సి వస్తుంది. కొంత మందికి అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి. ఆస్ట్రేలియాలోని హేమార్కెట్లో నివాసం ఉంటున్న ఒక మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. సాధారణంగా వాలెంటైన్స్ డే సందర్భంగా తమకు ప్రియమైన వారి కోసం ఏవో వారిస్థాయిని బట్టి బహుమతులు ఇస్తుంటారు. కానీ, ఆమె భర్త వాలెంటైన్స్ డే నాడు తనకు ఓ లాటరీ టికెట్ బహుమతిగా ఇచ్చాడు. అందుకు ఆమె సంతోషించలేదు. పైగా లాటరీ టికెట్ కొన్నందుకు తన భర్తపై మరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ.. ఇప్పుడా లాటరీనే వారిద్దరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. వివరాల్లోకి వెళితే..
వాలెంటైన్స్ డే సందర్భంగా మరియా చికాస్ అనే మహిళ భర్త.. ఆమెకు ఓ లాటరీ టికెట్ ను బహుమతిగా ఇచ్చాడు. అందరూ వాలెంటైన్స్ డే సందర్భంగా తమకు ఇష్టమైన వారి కోసం స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తుంటారు.. కానీ తన భర్త లాటీరీ గిఫ్ట్ గా ఇవ్వడం ఆమెకు అస్సలు నచ్చలేదు. లాటరీని చిన్న కాగితం ముక్కలా భావించి.. తన భర్తపై మండిపడింది. దీనికి కారణం ఎంతో కాలం నుంచి తాము లాటరీ కొన్నా ఒక్క పైసా కూడా రాలేదు.. తమకు అదృష్టం లేని దానిని తనకు గిఫ్ట్ గా ఇవ్వడంపై ఆమె ఆవేదనతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు అదే టికెట్ ఇద్దరి భవితవ్యాన్ని మార్చేసింది.అదే లాటరీ టిక్కెట్టు నుంచి 10 కోట్ల రూపాయలు గెలవడంతో భార్య ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయింది.ఇది చదవండి: బాక్సాఫీస్ బరిలో వలిమై – భీమ్లా నాయక్.. పొత్తు కుదరట్లేదా?
వాస్తవానికి ఆ లాటరీ ఎప్పుడో తీసుకున్నదని.. తన భర్త మానసాస్లోని 9103 మాథిస్ అవెన్యూలో ఇన్ అండ్ అవుట్ మార్ట్ నుంచి ఈ లాటరీ టిక్కెట్‌ను కొన్నాడని ఆ మహిళ చెప్పింది. తొలుత అంత మొత్తం లాటరీ తనకు తగిలిందని తన భర్త కూడా నమ్మలేదని.. ప్రైజ్ మనీ గురించి వార్త బయటకు రావడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ జంటకు ప్రేమికుల రోజున ఇంత గొప్ప అదృష్టం కలిసి రావడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.